26-10-2025 12:03:42 AM
హైదరాబాద్, అక్టోబర్ 25 (విజయక్రాం తి): జూబ్లీహిల్స్‌లో మెజార్టీతో విజయం సాధించాలని, ఇక్కడ గెలిస్తే జీహెచ్‌ఎంసీ ఎలక్షన్‌లలో ఏకపక్షంగా విక్టరీ సాధిస్తామని, ఇందుకు నాయకులందరూ కలిసికట్టుగా పనిచేయాలని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దిశానిర్దేశం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఇంటింటికీ వివరిస్తూ.. బీఆర్‌ఎస్ హయాంలో హైదరాబాద్ మహా నగరం సాధించిన అభివృద్ధిని ప్రజలకు మరోసారి వివరించాలని ఆయన పేర్కొన్నారు.
తెలంగాణ భవన్‌లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లతో శనివారం ఆయన ప్రత్యేకంగా సమావేశమయ్యారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఉప ఎన్నికల ప్రచారంలో అనుసరించాల్సిన వ్యూహాలపై వారికి కేటీఆర్ దిశానిర్దేశం చేశారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో నాయకులందరూ కలిసికట్టుగా పని చేయాలని కేటీఆర్ పిలుపునిచ్చారు.
హైదరాబాద్ నగరంలో బీఆర్‌ఎ స్‌కు ఉన్న అపూర్వమైన బలాన్ని ఈ ఉప ఎన్నికలో చాటాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. నగరంలో రోజురోజుకు దిగజారుతున్న ప్రజల కనీస అవసరాలైన పారి శుధ్యం, తాగునీటి సరఫరా, మురికినీటి కాలువల నిర్వహణ వంటి వాటి సమస్యలను ప్రజలకు వివరించాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్ నగర అభివృద్ధిని పూర్తిగా పక్కన పెట్టి కేవలం రాజకీయా లకే పాల్పడుతుందని ఆయన విమర్శించారు.
హైదరాబాద్‌లో కాంగ్రెస్ మోసాల ను, 22 నెలల పాలనలో జరిగిన ‘హైడ్రా విధ్వంసం’ను ఎక్కడికక్కడ వివరించాలని తెలిపారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో పార్టీ గెలిస్తే, రాబోయే జీహెఎంసీ ఎన్నికల్లో ఏకపక్షంగా గెలుస్తామని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. జీహెఎంసీ పైన మూడోసారి కూడా గులాబీ జెండా ఎగరడం ఖాయమని ఆయ న అన్నారు.
రానున్న రోజుల్లో నగరంలో పార్టీ మారిన ఖైరతాబాద్, శేర్లింగంపల్లి ఎమ్మెల్యేల పైన అనర్హత వేటు కచ్చితంగా పడుతుందని చెప్పారు. ఆ రెండు నియోజకవర్గాల్లో కూడా ఉప ఎన్నికలు తప్పవని కేటీఆర్ అన్నారు. వీటితోపాటు రాష్ర్టవ్యాప్తంగా పార్టీ మారిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు వస్తాయని తెలిపారు.
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక విజయం ఖాయమని, అయితే మెజార్టీ కోసం మనం మరింత కష్టపడాలని కేటీఆర్ నాయకత్వానికి సూచించారు. బీఆర్‌ఎస్ అభ్యర్థి మాగంటి సునీత గోపీనాథ్‌కు ప్రజ లు ఓటు వేసేలా నాయకులందరూ సమష్టిగా కృషి చేయాలని కోరారు.