12 August, 2026 | 8:31 AM

కాంగ్రెస్ నేత తీరుపై మండిపడ్డ జర్నలిస్టులు

12-08-2026 12:00 AM

ఆందోళనలకు పిలుపు...

హుజురాబాద్,ఆగస్టు 11,విజయ క్రాంతి: కరీంనగర్ జిల్లాహుజురాబాద్ జర్నలిస్టుల ఇండ్ల స్థలాల వివాదంపై స్పందించడానికి నిరాకరించడమే కాకుండా, స్వపక్ష ప్రభుత్వంపైనే తీవ్ర వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ నాయకుడు గూడూరి స్వామి రెడ్డి వైఖరిని నిరసిస్తూ.బుధవారం నుంచి దశలవారీ ఆందోళనలు చేపట్టనున్నట్లు  ప్రెస్ క్లబ్ అధ్యక్ష,కార్యదర్శి కాయిత రాములు,  రవీందర్ లు ప్రకటించారు.

గత ప్రభుత్వంలో జర్నలిస్టులకు కేటాయించిన ఇండ్ల స్థలాలపై స్వామి రెడ్డి కోర్టులో కేసు వేసిన నేపథ్యంలో, సమస్యను పరిష్కరించుకోవాలనే ఉద్దేశంతో ప్రెస్ క్లబ్ ప్రతినిధులు మంగళవారంఆయన స్వగ్రామమైన ఇప్పల నర్సింగాపూర్ లో ని ఆయన గృహానికి వెళ్లి బొకే ఇచ్చి విజ్ఞప్తి చేశారు. అయితే, కేసును ఉపసంహరించుకోవడానికి ఆయన నిరాకరించారు.

ఆయన వ్యవహరించిన తీరుకు నిరసనగా ఆందోళన కార్యక్రమాలు ఉధృతం చేస్తామని ప్రెస్ క్లబ్ అధ్యక్ష  కార్యదర్శి లు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్ట్ లు కోరం సుధాకర్ రెడ్డి, నంబీ భరణికుమార్ , నిమ్మటూరి సాయికృష్ణ,కేదాసి శ్రీధర్, టేకుల సాగర్, ఎడ్ల కుమార్, పబ్బతిరుపతి, మచ్చిక చందు, గొపగాని మహేష్, ఎన్ టివి రాజు, పోతరాజు సంపత్,పయిమ్, నాగవెల్లి రాజు,భారత రజనీకాంత్  తదితరులు పాల్గొన్నారు.