12 August, 2026 | 1:34 AM

ప్రధాని నరేంద్ర మోదీ పాలనను డిలీట్ చేయక తప్పదు

12-08-2026 12:00 AM

సీపీఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్

మానకొండూర్, ఆగస్టు 11 (విజయ క్రాంతి): దేశవ్యాప్తంగా ప్రజలు డిజిటలైజేషన్ ను ఉపయోగించుకోవాలని ప్రధాని నరేంద్ర మోడీ పదేపదే చెప్పడం వల్ల ప్రజలంతా డిజిటలైజేషన్ ను ఉపయోగించుకుంటున్న తరుణంలో ప్రజలపై పన్నుల భారాన్ని మోపుతున్నాడని, ఆ భారాన్ని మోయలేక ప్రజలు రానున్న రోజుల్లో తమ ఓట్ల ద్వారా బిజెపి ప్రభుత్వాన్ని, నరేంద్ర మో డీని డిలీట్ చేయక తప్పదని సిపిఐ జిల్లా కార్యదర్శి హెచ్చరించారు.

సిపిఐ ప్రచార జాతా మంగళవారం 6వ రోజు మానకొండూర్ మండలంలో పర్యటించింది. ముఖ్య అతిథిగా పంజాల శ్రీని వాస్ హాజరై మాట్లాడుతూ దేశంలో బీజేపీ ప్రభుత్వం పాలనపై విసుగు చెందుతున్న నేపధ్యంలో మార్పు కోసం సెప్టెంబర్ 1 న సిపిఐ జాతీయ సమితి పిలుపుమేరకు ఢిల్లీలో జరిగే ఆందోళన కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కోసం అధిక సంఖ్యలో సిపిఐ శ్రేణుల్లో ఢిల్లీకి తరలి రావాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు పొనగంటి కేదారి, అందె స్వామి, మండల కార్యదర్శి బండ రాజిరెడ్డి, జాతా కో ఆర్డినేటర్స్ కసిరెడ్డి సురేందర్ రెడ్డి, బోయిని అశోక్, గూడెం లక్ష్మీ, నాగెల్లి లక్ష్మారెడ్డి, టేకుమల్ల సమ్మయ్య, జిల్లా కౌన్సిల్ సభ్యులు బీర్ల పద్మ, కొట్టె అంజలి, బామండ్ల పెల్లి యుగేందర్, తదితరులు పాల్గొన్నారు.