calender_icon.png 25 August, 2025 | 7:09 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలి

25-08-2025 04:40:28 PM

కుభీర్: కుభీర్ మండలంలోని జర్నలిస్టులు తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ మండల తహసీల్దార్‌కి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఎంతోకాలంగా కష్టపడి పనిచేస్తున్న అర్హులైన జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు, ఇళ్ల నిర్మాణం మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

జర్నలిస్టులు కూడా ప్రజా సమస్యలను వెలుగులోకి తెస్తూ సమాజానికి సేవ చేస్తున్నారని, వారికి తగిన గుర్తింపు, గృహ సౌకర్యం కల్పించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ప్రభుత్వం ఈ అంశంపై సానుకూలంగా స్పందించి తక్షణమే చర్యలు తీసుకోవాలని, కుభీర్ మండల ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు గఫురుద్దీన్, తోటి జర్నలిస్టులు విట్టల్, రవి కుమార్, సాయన్న, పండరి, బాలాజీ, ప్రసాద్, ఆనంద్, మోహివుద్దీన్ కలిసి వినతి పత్రంని అందచేయడం జరిగింది. ఈ వినతిపత్రాన్ని కుభీర్ మండల తహసీల్దార్ స్వీకరించారు.