calender_icon.png 25 August, 2025 | 9:16 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎంపీ రవిచంద్ర చొరవతో సీసీ రోడ్డు మంజూరు

25-08-2025 06:21:36 PM

మహబూబాబాద్,(విజయక్రాంతి): రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర చొరవతో ఇనుగుర్తి మండలం కోమటిపల్లి శివారు కోఖ్యా తండాలో ప్రజలకు రోడ్డు వసతి ఏర్పడింది. తండాలో అంతర్గత రోడ్లు దెబ్బతిని ప్రజలకు ఇబ్బంది కలుగుతున్న విషయాన్ని ఎంపీ రవిచంద్ర దృష్టికి తీసుకువెళ్లగా, స్పందించిన ఎంపీ వెంటనే సిమెంట్ రోడ్డు నిర్మాణానికి ఐదు లక్షల రూపాయలను తన సిడిఎఫ్ నుంచి మంజూరు చేశారు. ఈ మేరకు సోమవారం రోడ్డు పనులను గ్రామ మాజీ సర్పంచ్ నీలం యాకయ్య ప్రారంభించారు.