25-08-2025 07:02:01 PM
చండూరు,(విజయక్రాంతి): పర్యావరణాన్ని పరిరక్షించుకోవడం ద్వారా ముందు తరాలను కాపాడుకోవచ్చని చండూరు మున్సిపల్ కమిషనర్ ఎస్. మల్లేశం అన్నారు. సోమవారం చండూర్ మున్సిపాలిటీ పరిధిలోని పదోవ వార్డులో బ్రహ్మంగారి వీధి నందు ఓం స్టేడ్ మొక్కలు పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... పర్యావరణాన్ని కాపాడుకోవడం మనందరి బాధ్యత అని ఆయన అన్నారు.