calender_icon.png 25 August, 2025 | 9:55 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రంగారెడ్డి జిల్లాలో రోడ్డు ప్రమాదం.. తండ్రీకూతుళ్ల మృతి

25-08-2025 06:38:56 PM

హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా(Ranga Reddy District)లోని చేవెళ్ల మండలంలో సోమవారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో తండ్రి, కూతురు ప్రాణాలు కోల్పోయారు. తండ్రి రవీందర్(40), కుమార్తె కృప(13) బైక్ పై మార్కెట్ వద్ద ఉండగా.. రెడిమిక్స్ లారీ అదుపుతప్పి ఢీకొట్టింది. తండ్రి, కుమార్తె అక్కడికక్కడే మృతిచెందారు. స్థానికుల సమాచారంతో ఘటనస్థలికి చేరుకున్న చేవెళ్ల పోలీసులు మృతదేహలను పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. అనంతరం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.