25-08-2025 06:14:27 PM
నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లా కేంద్రంలో స్వదేశీ జాగరణ మంచి ఆధ్వర్యంలో స్వదేశీ వస్తువుల వినియోగంపై అవగాహన ర్యాలీని సోమవారం నిర్వహించారు. పట్టణంలోని ఎన్టీఆర్ ట్యాంక్బండ్ నుంచి ఆర్డీవో కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి స్వదేశీ వస్తువులను మాత్రమే పౌరులు కొనుగోలు చేయాలని దీని వల్ల దేశ సంపద పెరుగుతుందని సంఘ నాయకులు శ్రావణ్ కుమార్ దినేష్ పేర్కొన్నారు.