calender_icon.png 25 August, 2025 | 9:39 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజావాణి కార్యక్రమంతో ప్రజా సమస్యల సత్వర పరిష్కారం

25-08-2025 06:25:53 PM

ప్రజావాణికి 72 దరఖాస్తుల స్వీకరణ

గద్వాల: ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులకు అధిక ప్రాధాన్యత ఇచ్చి అర్జీలను సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ బి.యం సంతోష్ సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టర్ కార్యాలయములోని సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన 72 మంది తమ సమస్యల పరిష్కరం కోసం దరఖాస్తు చేసుకున్నారని కలెక్టర్ తెలిపారు.

ప్రజావాణి కార్యక్రమంలో వచ్చిన దరఖాస్తులపై అధికారులు ప్రత్యెక దృష్టి సారించి వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు.  ప్రజావాణి అనంతరం చేనేత పెన్షన్లు మరింత పారదర్శకంగా, సులభంగా లబ్ధిదారులకు అందించే  విధంగా పోస్టల్ శాఖ ద్వారా ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీని అమలు చేస్తూ, ఈరోజు బ్రాంచ్ పోస్టుమాస్టర్లు, సబ్ పోస్టుమాస్టర్ల  84 మందికి బయోమెట్రిక్ పరికరాలు, స్మార్ట్‌ఫోన్లు కలెక్టర్ అందజేశారు. ప్రతి అర్హులైన లబ్ధిదారుడికి ఎలాంటి అవాంతరాలు లేకుండా చేనేత పెన్షన్ అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు.