calender_icon.png 6 December, 2025 | 12:35 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అయ్యప్ప స్వామి ఆలయానికి ఐదు లక్షల విరాళం

05-12-2025 11:39:01 PM

నిజాంపేట,(విజయక్రాంతి): నిజాంపేట మండల కేంద్రంలో అయ్యప్ప స్వామి ఆలయ నిర్మాణానికి శుక్రవారం మేడ్చల్ పట్టణానికి చెందిన గడ్డం లక్ష్మి శ్రీరామ్ గౌడ్ దంపతులు ఆలయ నిర్మాణం కోసం రూ.5 లక్షల విరాళాలని ప్రకటించారు. ఈ సందర్భంగా గురుస్వామి రంజిత్ గౌడ్ మాట్లాడుతూ.. నిజాంపేటలో అయ్యప్ప సేవాసమితి ఆధ్వర్యంలో దాతల సహకారంతో అయ్యప్ప ఆలయ నిర్మాణం కోసం స్థలం కేటాయించాం.

ఆ హరిహర పుత్రుని ఆలయం నిర్మాణం కోసం ఎవరైనా దాతలు ముందుకు వచ్చినట్లయితే ఆలయ నిర్మాణంలో తమ వంతు కృషి చేసిన వారు అవుతారని అలాగే ఆలయ నిర్మాణం కోసం ప్రతి ఒక్కరూ వారి పూర్తి సహాయ సహకారాలు అందించాలన్నారు. ఆలయ నిర్మాణానికి 5 లక్షల విరాళాన్ని ప్రకటించడం అయ్యప్ప స్వాములకు అన్నదాన భిక్ష ఏర్పాటు చేసిన గడ్డం లక్ష్మీ శ్రీరామ్ గౌడ్ కుటుంబ సభ్యులకు అయ్యప్ప ఆశీస్సులు అనుగ్రహం ఉండాలన్నారు.