calender_icon.png 6 December, 2025 | 12:47 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నామినేషన్ స్వీకరణ కేంద్రాలను సందర్శించిన కల్లూరు ఏసీపీ వసుంధర యాదవ్

05-12-2025 11:46:14 PM

ఖమ్మం,(విజయక్రాంతి): గ్రామపంచాయతీ ఎన్నికల నామినేషన్ స్వీకరణ కేంద్రాలను కల్లూరు ఏసీపీ వసుంధర యాదవ్ శుక్రవారం సందర్శించారు. ఏన్కూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రేపల్లెవాడ, తూతక్కలింగన్నపేట, గార్ల ఒడ్డు నామినేషన్ స్వీకరణ కేంద్రాలను సందర్శించి, ఎన్నికల సిబ్బందితో మాట్లాడారు. నామినేషన్ సందర్బంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఏర్పాటు చేసిన పోలీస్ బందోబస్తును పర్యవేక్షించాలని పోలీస్ అధికారులకు సూచించారు.

అదేవిధంగా వెంసూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వేంసూరు, మర్లపాడు, వెంకటాపురం నామినేషన్ స్వీకరణ కేంద్రాలను సందర్శించి, ఎన్నికల సిబ్బందితో మాట్లాడారు. నామినేషన్ సందర్బంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఏర్పాటు చేసిన పోలీస్ బందోబస్తును పర్యవేక్షించాలని పోలీస్ అధికారులకు సూచించారు.