calender_icon.png 5 December, 2025 | 11:54 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శిక్షణ పూర్తి చేసి స్వగ్రామానికి చేరుకున్న సైనికుడికి ఘనస్వాగతం

05-12-2025 11:00:22 PM

చిట్యాల,(విజయక్రాంతి): చిట్యాల మండలంలోని తాళ్ల వెల్లంల గ్రామానికి చెందిన ఏరుకొండ ప్రదీప్ కుమార్ ఇండియన్ ఆర్మీగా శిక్షణ పూర్తి చేసుకొని గ్రామానికి తిరిగి రావడంతో కుటుంబ సభ్యులు, గ్రామస్తులు అతనికి ఘన స్వాగతం పలికారు. గ్రామానికి చెందిన ప్రదీప్ కుమార్ దేశానికి సేవ చేయాలనే ఉద్దేశంతో ఆర్మీగా ఎంపికై అహ్మదాబాదులో ఆరు నెలలు శిక్షణ ముగించుకొని గ్రామానికి రావడం సంతోషకరమని, దేశ సైనికుడిగా శిక్షణ పూర్తి చేసుకున్న తొలి గ్రామస్తుడు ప్రదీప్ కావడం తమకు ఎంతో గర్వకారణంగా ఉందని అతని తల్లిదండ్రులు, గ్రామస్తులు అతన్ని అభినందించారు. డప్పు చప్పులతో,  పూలదండలతో, బాణసంచా కాల్చి ఘనంగా సన్మానించారు. గ్రామ యువత ప్రదీప్ ను ఆదర్శంగా తీసుకొని దేశ సేవ కోసం సిద్ధం కావాలని గ్రామస్తులు కోరారు.