calender_icon.png 6 December, 2025 | 12:33 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దేవుడే యేసు క్రీస్తు ప్రభువు

05-12-2025 11:31:31 PM

మహబూబ్ నగర్,(విజయక్రాంతి): ప్రపంచ మానవాళి కోసం సాక్షాత్తు దేవుడే యేసు క్రీస్తు ప్రభువు రూపంలో ఈ లోకానికి వచ్చి తన ప్రేమను పంచిన మాదిరే ప్రతి ఒక్కరు ఉండాలని ఎమ్మెల్యే యన్నం శ్రీనివాస్ రెడ్డి పిలుపునిచ్చారు. పాలమూరు పాస్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ పాత్ర కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన  మాదిరే ప్రతి ఒక్కరు ఉండాలని ఎమ్మెల్యే యన్నం శ్రీనివాస్ రెడ్డి పిలుపునిచ్చారు. పాలమూరు పాస్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ పాత్ర కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన గ్రాండ్ క్రిస్మస్ సెలబ్రేషన్స్ ముగింపు సందర్భంగా శుక్రవారం హాజరయ్యారు.

క్రిస్మస్ సీజన్ ప్రపంచవ్యాప్తంగా ఒక పండుగ వాతావరణం లో వేడుకలు నిర్వహించుకోవడం సంతోషకరమన్నారు. ప్రేమతో రాణించే క్రైస్తవుల కోసం తమ ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికల్ని రూపొందించుదని ఈ సందర్భంగా గుర్తు చేశారు దాన్ని వర్గాల అభివృద్ధి కోసం తమ ప్రభుత్వం పాటుపడుతుందన్నారు. జిల్లా రాష్ట్ర క్షేమం కోసం ప్రత్యేకంగా ప్రార్థించాలని ఆయన విజ్ఞప్తి చేశారు అనంతరం క్రిస్మస్ కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు.

 మనకోసం దేవుడే వచ్చాడు: పాస్టర్ జాన్ వెస్లీ

2 వేల సంవత్సరాల క్రితం మనకోసం దేవుడే ఈ లోకానికి వచ్చాడని పాస్టర్ జాన్ వెస్లీ అభివర్ణించారు గ్రాండ్ క్రిస్మస్ వేడుకల ముగింపు సందర్భంగా ఆయన హాజరై ప్రసంగించారు. క్రిస్మస్ అంటే కానుకల పండగ ఎందుకంటే దేవుడే మనకోసం తన కుమారుడిని కానుకగా ఇచ్ఛిన పండగ ఈ పండగ అంటే పరివర్తన చెంది మీరు కూడా యేసుక్రీస్తు ప్రభువును పోలి నడచుకోవాలని పిలుపునిచ్చారు. దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఆయనకు సాక్షులుగా ఉందామన్నారు. అనంతరం ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ కార్యక్రమంలో చెర్మన్ పాస్టర్ జయపాల్ కార్యదర్శి పాస్టర్ అమర్, కోశాధికారి పాస్టర్ జాన్ పాస్టర్లు ప్రసాద్, రవిబాబులతో అదిక సంఖ్యలో విశ్వాసులు తదితరులు పాల్గొన్నారు.