calender_icon.png 6 December, 2025 | 12:07 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సుల్తానాబాద్ మండలంలో ముగిసిన నామినేషన్ల పర్వం

05-12-2025 11:22:03 PM

నారాయణరావు పల్లి సర్పంచ్ కు రాజిరెడ్డి ఒక్కరే నామినేషన్ దాఖల్

సుల్తానాబాద్,(విజయక్రాంతి): మూడవ విడత ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన నామినేషన్ల పర్వం శుక్రవారంతో ముగిసింది. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని చాలా గ్రామాల నుంచి అభ్యర్థులు తమ నామినేషన్లు దాఖలు చేశారు. ఈ రోజు మంచి రోజు కావడంతో అన్ని గ్రామాల నుంచి సర్పంచుకు పోటీ చేసే అభ్యర్థులు తమ అనుచర గణాలతో ర్యాలీలు నిర్వహిస్తూ, నామినేషన్ల  దా కాల్ చేశారు. సుల్తానాబాద్ మండలంలోని నారాయణరావుపల్లి గ్రామపంచాయతీ సర్పంచ్ పదవి కోసం ఒకే ఒక్క నామినేషన్ దాఖలయింది.

గతంలో ఉమ్మడి గ్రామపంచాయతీగా గొల్లపల్లి ఉన్నప్పుడు ఆ గ్రామ మాజీ సర్పంచ్ మండల సర్పంచ్ల ఫోరం మాజీ అధ్యక్షుడు నామిని రాజిరెడ్డి నారాయణరావుపల్లి సర్పంచ్ గా నామినేషన్ ఒక్కరే దాఖలు చేశారు. దీంతో ఇక్కడ ఏకగ్రీవం అయింది. అధికారులు ఈ ఏకగ్రీవ ఎన్నికను ప్రకటించాల్సి ఉంది, నామినేషన్ ఉపసంహరణల ప్రక్రియ పూర్తి అయిన తర్వాత అధికారులు ఏకగ్రీవాలను ప్రకటిస్తారు. ఈ సందర్భంగా నారాయణరావుపల్లి లో  గ్రామస్తులు నామని రాజిరెడ్డిని ఘనంగా సన్మానించారు..  అలాగే పలు వార్డు సభ్యులకు కూడా ఏకగ్రీవంగాఎన్నికైన అవకాశాలు ఉన్నాయి. సుల్తానాబాద్ మండలంలో 27 గ్రామ పంచాయతీలు ఉండగా సర్పంచ్ పదవుల కోసం నామినేషన్లు దాఖలు అయ్యాయి అలాగే వార్డ్ స్థానాలకు గాను నామినేషన్లు దాకలయ్యాయి.