calender_icon.png 6 December, 2025 | 12:52 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గ్రామాలలో శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే చర్యలు

05-12-2025 11:42:42 PM

సిసిఆర్బీ ఏసీపీ సాంబరాజు

ఖమ్మం,(విజయక్రాంతి): బోనకల్లు మండలంలో నామినేషన్ వేసిన సర్పంచ్, వార్డ్ సభ్యులతో సిసిఆర్బీ ఏసీపీ సాంబరాజు శుక్రవారం బోనకల్లులో సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఏసీపీ మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఎన్నికలు అత్యంత కీలకమని, స్థానిక ఎన్నికలను అందరూ ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం జరుగుతుంది.

కాబట్టి ప్రతీ ఒక్కరూ వారి ఓటు హక్కును ఎలాంటి ప్రలోభాలకు, భయ బ్రాంతులకు లోనుకాకుండా స్వేచ్ఛగా ఓటు హక్కు సద్వినియేగం చేసుకునే వాతావరణాన్ని కల్పించడానికి పోలీస్ శాఖ చేస్తున్న పటిష్టమైన చర్యలకు ప్రతిఒక్కరు సహకరించాలని అన్నారు. సమస్యాత్మక గ్రామాలపై ప్రత్యేక దృష్టి పెట్టామని అన్నారు. ఘర్షణ వాతావరణం పూర్తిగా  నిర్మూలించి సమన్వయంతో ప్రతి ఒక్కరు ఉండాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో ఎస్సై వెంకన్న తదితరులు పాల్గొన్నారు.