05-12-2025 11:35:37 PM
- ఐజెయు నిరంతరం జర్నలిస్టుల పక్షాన పోరాటం
- త్వరలోనే యూనియన్ నుంచి హెల్త్ క్యాంపు, శిక్షణ తరగతులు
- టీయూడబ్ల్యూజే (ఐజేయు) రాష్ట్ర కార్యదర్శి మధు గౌడ్
- యూనియన్ నూతన కార్యవర్గం ఏకగ్రీవం
- అధ్యక్ష, కార్యదర్శులుగా నాగరాజుగౌడ్, సతీష్ రెడ్డి
మహబూబ్ నగర్: టియుడబ్ల్యుజే (ఐజెయూ )గత 70 ఏళ్లుగా నిరంతరంగా జర్నలిస్టుల పక్షాన్నే పోరాటం చేస్తుందని యూనియన్ రాష్ట్ర కార్యదర్శి మధుగౌడ్ పునరుద్ఘాటించారు. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని సురవరం ప్రతాపరెడ్డి ప్రెస్ క్లబ్ లో ఏర్పాటుచేసిన సమావేశంలో యూనియన్ జిల్లా నూతన కార్యవర్గాన్ని ప్రకటించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మహాసభ ను కనివినీ ఎరుగని రీతిలో విజయవంతం చేసినందుకు శుభాకాంక్షలు తెలిపారు.
యూనియన్ లో ఒకరు గొప్ప మరొకరు తక్కువ అని ఉండదన్నారు. యూనియన్ బలోపేతానికి కృషి చేయాలని, జర్నలిస్ట్ ల కోసం వారి సంక్షేమం కోసం నిరంతరంగా కృషి చేయాలన్నారు. యూనియన్ ఆధ్వర్యంలో హెల్త్ క్యాంపు లు, శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. అనంతరం ఎన్నికల అధికారి బాలస్వామి మాట్లాడుతూ జిల్లా కమిటీ ఏకగ్రీవం చేసేందుకు అందులో భాగస్వములైన అందరికి ధన్యవాదాలు తెలిపారు.
నూతన కమిటీ బాగా పని చేసి గతంలో ఎన్నడూ లేని విధంగా కొత్త కార్యక్రమాలు నిర్వహిస్తూ ముందుకు సాగాలని కృషి చేయాలన్నారు. ఇండ్లు రాని జర్నలిస్ట్ ల పక్షాన పోరాడాలని కోరారు. ప్రశాంత్ మాట్లాడుతూ గత తొమ్మిది రోజులుగా ఉమ్మడి జిల్లాలో కమిటీ లు, మహాసభలు నిర్వహించినట్లు తెలిపారు. సమిష్టిగా ఏకగ్రీవం చేసినందుకు సంతోషంగా లో ఉందని యూనియన్ జిల్లా మాజీ అధ్యక్షుడు దత్తు మాట్లాడారు. మహాసభ కన్వీనర్ కేఏ విజయరాజు మాట్లాడుతూ ఎన్నికల ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసేందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
టియుడబ్ల్యుజె ఐజేయు నూతన కార్యవర్గం ఎన్నిక
తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (ఐజెయు) మహబూబ్నగర్ జిల్లా శాఖ నూతన కార్య వర్గంను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్భంగా నూతన కార్యవర్గాన్ని ఎన్నికల అధికారి మాల్యాల బల స్వామి, సహా ఎన్నికల అధికారి కొంతం ప్రశాంత్, రాష్ట్ర కార్యదర్శి మధుగౌడ్ లు ప్రకటించారు. ఈ సందర్భంగా అధ్యక్షులు కాటం నాగరాజు (దిశ), ఉపాధ్యక్షులుగా కె.పవన్ కుమార్ రెడ్డి (టిజి న్యూస్), మెరాజ్ (సిటి ఇండియా న్యూస్), ఐలమోని శేఖర్ (ప్రజా పక్షం), కరణం భాస్కర్ రావ్ (వేకువ సమయం)కార్యదర్శిగా ఎన్. సతీష్ రెడ్డి (వార్త),సంయుక్త కార్యదర్శులుగా రవీందర్ గౌడ్ (సిటీ ఇండియా న్యూస్),
ఎం.డి. జాఫర్ (4 టివి),ప్రభాకర్ (మనతెలంగాణ), గోకులం వెంకటేష్ (టిఎస్ న్యూస్), కోశాధికారిగా జిల్లెల రఘు (విజయ క్రాంతి),గౌరవ సలహాదారుగా కె.విజయ రాజు, (వార్తా తరంగాలు), కార్యవర్గ సభ్యులు దేవరకద్ర - ప్రశాంత్ (దిశ), సిసికుంట - వేణుగోపాల చారి (ఆంధ్రజ్యోతి), 3. భూత్పూర్ - గొడుగు వెంకటయ్య (వార్తా), గంధీడ్ - వీరాజ్ (దిశ), నవాబ్పేట్ - శేఖర్ (వార్తా), రాజాపూర్ - శివ ప్రసాద్,శేఖర్, అనిల్ కుమార్, శివకుమార్, వెంకటేష్ గౌడ్, నరసింహారెడ్డి, ఎం శ్రీనివాసులు, రామకృష్ణ, వేణు, మాణిక్ రావు, ఎన్ చంద్రశేఖర్ గౌడ్, కొత్త గోపాల్ ఉన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టులు యూనియన్ నాయకులు పాల్గొన్నారు.