calender_icon.png 6 December, 2025 | 12:07 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బెల్లంపల్లిలో పోలీసు కమ్యూనిటీ కాంటాక్ట్

05-12-2025 11:25:49 PM

బెల్లంపల్లి,(విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం ఎన్నికలను పురస్కరించుకొని భూధకలాన్ గ్రామం మన్నెగూడంలో శుక్రవారం రాత్రి పోలీసులు కమ్యూనిటీ కాంటాక్ట్  కార్యక్రమం నిర్వహించారు. బెల్లంపల్లి ఏసీపీ మన్నెగూడలో రానున్న గ్రామ పంచాయతీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమాన్ని నిర్వహించాము.

ఈ సందర్బంగా బెల్లంపల్లి రూరల్ సీఐ సీహెచ్ అనూక్ మాట్లాడుతూ... అన్ని వాహనాలకు  సరైన పత్రాలు ఉంచుకోవాలని, గుడుంబా, మద్యం అమ్మకాలు చేపట్టద్దని తెలిపారు. ఎలాంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలలో పాల్గొనవద్దన్నారు.  ఎన్నికలు స్వేచ్ఛాయుత వాతావరణం లో జరగాలనీ, ఎలాంటి ప్రలోభాలకి లోనుకావద్దని అందరూ తమ  ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకోవాలని సూచించారు.  ఈ కార్యక్రమం లో  బెల్లంపల్లి, నెన్నెల తాళ్ళగురిజాల ఎస్ ఐ లు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.