19-01-2026 12:00:00 AM
నేతల అంచనాలు తలక్రిందులు
అశావాహులకు ఊహించని షాక్
మెదక్ జిల్లాలో నాలుగు బల్దియాలు మహిళలకే కేటాయింపు
సంగారెడ్డి, జనవరి 18(విజయక్రాంతి): ఉమ్మడి మెదక్ జిల్లాలో మున్సిపల్ చైర్పర్సన్లుగా 50 శాతంకు పైగా మహిళలే ఏలను న్నారు. పట్టణ ప్రథమ పౌరురాలిగా అందలమెక్కనున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 20 బల్దియా స్థానాల్లో 12 స్థానాల్లో మహిళలకే పట్టం కట్టనున్నారు. మెదక్ జిల్లాలో నాలుగు మున్సిపాలిటీలను మహిళలకే కేటాయించడం గమనార్హం. రాష్ట్ర యూనిట్లో భాగంగా ఉమ్మడి జిల్లాకు 12 స్థానాలను మహిళలకు కేటాయించినట్లు తెలుస్తోంది. మెదక్ మున్సిపాలిటీలో 26 ఏళ్ళకు మళ్ళీ మహిళకు అవకాశం దక్కింది.
శనివారం ప్రకటించిన రిజర్వేషన్ల ప్రకారం చైర్మన్ పదవి రిజర్వేషన్లతో పాటు వార్డుల రిజర్వేషన్లు సైతం ప్రకటించారు. అందరి అంచనా లు తలక్రిందులు చేస్తూ రిజర్వేషన్లు ప్రకటించడంతో ఆశావహుల్లో ఆందోళన మొదలైం ది. బల్దియా రిజర్వేషన్ల ప్రకటన కొందరు మోదం.మరికొందరికి ఖేదంగా మారింది. దీంతో ఏం చేయాలో పాలుపోని స్థితిలో ఆ శావహులు అయోమయానికి గురవుతున్నారు.
కొందరికి మోదం..మరికొందరికి ఖేదం..
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక రెండేళ్ళ తర్వాత మున్సిపల్ ఎన్నికలు నిర్వహిస్తున్నారు. పదేళ్ళ పాటు రాష్ట్రం లో బీఆర్‌ఎస్ అధికారంలో ఉండడంతో కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని ఉన్న ఆశావహులకు మున్సిపల్ ఎన్నికలు ఊరటనిచ్చాయి. పదేళ్ళపాటు ఏ పదవి లేకుండా ఉన్న ఆశావహులకు అవకాశం లభిస్తుందని భావించినప్పటికీ రిజర్వేషన్లు ఆశనిపాతంగా మారా యి. మరికొందరికి రిజర్వేషన్లు అనుకూలించడంతో అదృష్టాన్ని పరీక్షించుకోను న్నారు. మొత్తానికి రిజర్వేషన్ల ప్రక్రియ కొందరికి మోదం..మరికొందరికి ఖేదంగా మా రిందని చెప్పొచ్చు.
మెదక్ జిల్లాలో నాలుగు స్థానాలు మహిళలకే...
రాష్ట్ర యూనిట్లో భాగంగా రిజర్వేషన్ల ప్రక్రియ చేపట్టగా మెదక్ జిల్లాలో నాలుగు మున్సిపాలిటీ చైర్మన్ పదవులను మహిళలకే కేటాయించారు. సిద్దిపేట జిల్లాలో ఐదు మున్సిపాలిటీలకు గాను మూడు స్థానాలు, సంగారెడ్డి జిల్లాలో 11 మున్సిపాలిటీలకు 5 స్థానాలను మహిళలకు కేటాయించగా మొ త్తంగా 12 మున్సిపాలిటీల్లో మహిళలకే కేటాయించడం జరిగింది. సంగారెడ్డి జిల్లాలో గడ్డపోతారం, ఇంద్రేశం ఎస్సీ మహిళ, ఇస్నాపూర్, సదాశివపేట, సంగారెడ్డి మున్సి పాలిటీలో జనరల్ మహిళకు కేటాయించారు.
మెదక్ జిల్లాలో మెదక్ బీసీ మహిళ, రామాయంపేట, నర్సాపూర్, తూప్రాన్ మున్సిపాలిటీలను జనరల్ మహిళకు కేటాయించారు. సిద్దిపేట జిల్లాలో ఐదు మున్సి పాలిటీలకు గాను గజ్వేల్, దుబ్బాక స్థానాలకు బీసీ మహిళ, చేర్యాలకు ఎస్సీ మహిళ ను కేటాయించారు. అలాగే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 50 శాతం రిజర్వేషన్ల కింద వార్డులను మహిళలకు కేటాయించారు.