30-01-2026 08:47:59 PM
సత్యాగ్రహమే ఆయుధం.... సంతృప్తియే ఆభరణం
మాజీ డిప్యూటీ మేయర్ రెడ్డి శెట్టి శ్రీనివాస్
జవహర్ నగర్,(విజయక్రాంతి): మనిషి విజయం సాధించేవరకు సాధన చేస్తూనే ఉండాలని, సత్యాగ్రహమే తన ఆయుధమని, అహింస పరమోధర్మమని, విజయం సాధించే వరకు కఠినమైన సాధన చేస్తూనే ఉండాలని ఇవి మహాత్ముని బోధనలని, బృహత్ నగర పరిధిలోని జవహర్ నగర్ మాజీ డిప్యూటీ మేయర్ రెడ్డి శెట్టి శ్రీనివాస్ తెలిపారు. జాతిపిత మహాత్మా గాంధీ 78వ వర్ధంతి సందర్భంగా జవహర్ నగర్ పరిధిలోని పాపయ్య నగర్ కాలనీలో గాంధీ విగ్రహానికి మాజీ డిప్యూటీ మేయర్ రెడ్డి శెట్టి శ్రీనివాస్ శుక్రవారం పూలమాలలు వేసి వందనం సమర్పించి నివాళులర్పించారు.
అనంతరం మాట్లాడుతూ... మహాత్మాగాంధీ ఆంగ్లేయల పాలన నుండి భారతదేశానికి స్వాతంత్రం సంపాదించి పెట్టిన అగ్ర గన్యులలో మహాత్మా గాంధీ ముందు వరసలో ఉన్నారన్నారు. ప్రజలు అతన్ని మహాత్ముడని జాతిపిత అని గౌరవిస్తారు అన్నారు .సత్యము అహింస గాంధీజీ నమ్మే సిద్ధాంతాలని అవే సహాయ నిరాకరణ, సత్యాగ్రహం, అతని ఆయుధాలు అన్నారు. కొళాయి కట్టి చేత కర్ర బట్టి నూలు వడికి మురికి వాడలను శుభ్రం చేసి అందరము ఒక్కటే అని చాటి చెప్పిన మహా వ్యక్తి అని తెలిపారు.
అహింసా విధానంలో కోట్లాదిమంది ప్రజలను ఒక్కతాటిపై నడిపి స్వాతంత్రం సంపాదించి పెట్టిన ధీరుడు అన్నారు. గాంధీజీ సిద్ధాంతాలలో మహిళా సాధికారికత గ్రామ స్వరాజ్యం పేదరిక నిర్మూలన వంటి అనేక ఆశయాలను నిజం చేయడానికి జవహర్ నగర్ లోని ప్రజలందరూ కలిసికట్టుగా కృషి చేద్దామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బాలు ముదిరాజ్, భారతి, మల్లేష్, మోహన్ రెడ్డి, కరుణాకర్ రెడ్డి, విజయ్, తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.