23-07-2025 12:04:17 AM
ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి
మహబూబ్‌నగర్, జూలై 22 (విజయక్రాంతి): విద్యాభివృద్ధికి జేపీఎన్సీ చైర్మన్ కేఎస్ రవికుమార్ చేస్తున్న కృషి అభినందనీయమని మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. ఎఫ్‌సెట్‌లో ఇంజనీరింగ్ విభాగంలో 10 వేల లోపు ర్యాంక్ సాధించి, మహబూబ్‌నగర్ నియోజకవర్గంలోని జయప్రకాశ్ నారాయణ ఇం జనీరింగ్ కళాశాలలో సీటు పొందిన విద్యార్థులు మహమ్మద్ సాకిబు(8279 ర్యాంక్), హుస్నా ఫాతీన్(9192 ర్యాంక్)లకు మంగళవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే సుమారు రూ.54 వేల విలువ గల ల్యాప్‌టాప్‌లను జయప్రకాశ్ నారాయ ణ ఇంజనీరింగ్ కళాశాల తరఫున ఉచితంగా అందచేశారు.
నెక్స్ వేవ్ శిక్షణ సంస్థ ద్వారా శిక్షణకు సంబంధించి ట్రైనింగ్ పొందుటకు ఒక్కరికి రూ.40 వేల చెక్కును ఎమ్మెల్యే అందజేశారు. 10 వేల లోపు ర్యాంకు పొంది రెండోవ విడత కౌన్సిలింగ్ ద్వారా కూడా జయప్రకాశ్ నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలో సీటు పొందిన విద్యార్థులకు ఉచితం గా ల్యాప్‌టాప్, నెక్స్ వేవ్ శిక్షణ సంస్థకు సంబంధించిన ట్రైనింగ్ శిక్షణ పొందుటకు తమ కళాశాల తరఫున ఒక్కరికి రూ.40 వేలు అందజేస్తామని కళాశాల చైర్మన్ కేఎస్ రవికుమార్ తెలిపారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడు తూ.. జేపీఎన్‌సీ చైర్మన్ కెయస్ రవికుమార్ విద్యార్థులను ప్రోత్సహించేందుకు ఉచితం గా ల్యాప్‌ట్యాప్‌లను, ఉచిత శిక్షణ పొందేందుకు రూ.40 వేలు అందించడం ఆనందం గా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డాక్టర్ పి కృష్ణమూర్తి, కె సందీప్ కుమార్, గురు రాఘవేందర్‌రెడ్డి, వెంకటేష్, సయ్యద్ ముస్తాక్ అలి, నగేష్ తదితరులు పాల్గొన్నారు.