23-07-2025 08:38:12 PM
గద్వాల్ టౌన్: హెల్పింగ్ హ్యాండ్స్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మెటీరియల్ పంపిణీ కార్యక్రమంలో భాగంగా బుధవారం కొండపల్లి, శెట్టి అత్కూర్, కేజీబీవీ గోనుపాడు గ్రామాల నందు 10వ తరగతి విద్యార్థులకు మెటీరియల్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మండల విద్యాశాఖ అధికారి శ్రీనివాస్ గౌడ్(Mandal Education Officer Srinivas Goud) హాజరై ట్రస్ట్ సేవలను అభినందించారు. విద్యార్థులు ఈ మెటీరియల్ను సద్వినియోగపరచుకొని కష్టపడి మంచి మార్కులు తెచ్చుకుని పాఠశాలకు తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ చైర్మన్ రత్న సింహారెడ్డి ఆయ ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయ బృందం తదితరులు పాల్గొన్నారు.