calender_icon.png 24 July, 2025 | 3:54 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మహిళలు తమ ఉత్పత్తులను ప్రదర్శించి ఆదాయం పొందడం అభినందనీయం

23-07-2025 08:32:23 PM

పీర్జాదిగూడ నగరపాలక సంస్థ కమిషనర్ త్రిల్లేశ్వర్ రావు..

స్ట్రీట్ ఫుడ్ ఫెస్టివల్ కార్యక్రమంతో మహిళ సంఘాలకు ఆదాయ మార్గం..

మేడిపల్లి: మహిళలు తమ ఉత్పత్తులను ప్రదర్శించి ఆదాయం పొందడం అభినందనీయమని పీర్జాదిగూడ నగరపాలక సంస్థ కమిషనర్ త్రిల్లేశ్వర్ రావు(Municipal Commissioner Thrilleshwar Rao) అన్నారు. పీర్జాదిగూడ నగరపాలక సంస్థ పరిధిలోని స్వయం సహాయక సంఘాలు తయారు చేసిన ఉత్పత్తులను నగర ప్రజలు ఆదరించాలని కమిషనర్ త్రిలేశ్వరరావు పేర్కొన్నారు. బుధవారం నగరపాలక సంస్థ పరిధిలోని బుద్ధానగర్ పార్క్ వద్ద ఏర్పాటు చేసిన స్ట్రీట్ ఫుడ్ ఫెస్టివల్ ను కార్యాలయ సిబ్బందితో కలసి కమిషనర్ సందర్శించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, మహిళలకు ఆదాయం, మంచి గుర్తింపు, మార్కెట్లో రాణించుటకు చక్కటి అవకాశామన్నారు. 100 రోజుల కార్యాచరణ ప్రణాళికలో "స్ట్రీట్ ఫుడ్ ఫెస్టివల్” కార్యక్రమాన్ని పరిచయం చేయడం మహిళ సంఘాల సభ్యులకు అదృష్టంగా భావించాలన్నారు.

మహిళలు ఎంతో కష్టపడి తమ ఉత్పత్తులను ప్రదర్శించడం ద్వారా ఆదాయం సంపాదించటం అభినందనీయమన్నారు. వీది ఆహార విక్రయంలో పిండి వంటలు, మిల్లెట్స్, ఆర్గానిక్ ప్రొడక్ట్స్, చేతివృత్తుల వస్తువులు, అల్లికలు, పచ్చళ్లు ఉన్నట్లు తెలిపారు. జూలై 25వ తేది వరకు జరిగే స్ట్రీట్ ఫుడ్ ఫెస్టివల్ ను ప్రజలు సందర్శించి స్వయం సహాయక సంఘాలని ప్రొత్సహించాలని కోరారు. ఈకార్యక్రమంలో అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్ శోభాశంకర్, డిప్యూటీ ఇ.ఇ జి. సాయినాథ్ గౌడ్, ఎఇ వినిల్ కుమార్, మేనేజర్లు క్రాంతికుమార్, కిశోర్, ఎస్ఐ ప్రవీణ్ కుమార్, ఇన్విరాన్మెంటల్ ఇంజనీర్ జి. బాలమురళికృష్ణ, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.