15-11-2025 12:25:23 AM
బూర్గంపాడు,నవంబర్14 (విజయక్రాంతి):జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలిచిన సందర్భంగా మండలంలోని సారపాక ప్రధాన కూడలిలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు దుగ్గంపూడి కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో టపాసులు కాల్చి కేక్ కట్ విజయోత్సవ వేడుకలు జరిపారు. ఈ సందర్భంగా డిసిసి మైనార్టీ సెల్ చైర్మన్ మహమ్మద్ ఖాన్ మహమ్మద్ ఖాన్, దుగ్గెంపూడి కృష్ణారెడ్డి మాట్లాడుతు ఫామ్ హౌస్ కు పరిమితమైన కేసీఆర్ ను నమ్ముకుంటే ఏం జరుగుతుందో జూబ్లీహిల్స్ ప్రజలు నిరూపించారని ఇది బిఆర్‌ఎస్ పార్టీకి చెంపపెట్టు అని విమర్శించారు.
జూబ్లీహిల్స్ ఎన్నికల సందర్భంగా బిఆర్‌ఎస్ నాయకులు రాజకీయ విలువలు దిగజార్చారని, గెలుపు కోసం పచ్చి అబద్దాలు చెపుతు, తప్పుడు విమర్శలు చేసారని గుర్తు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి హయాంలో ప్రజా ప్రభుత్వం ఎన్నో ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతుంటే వాటిని జీర్ణించుకోలేక ఎన్నికల్లో జూబ్లీహిల్స్ ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నించారని పేర్కొన్నారు.
నవీన్ యాదవ్ ను గెలిపించిన జూబ్లీహిల్స్ ఓటర్ లకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బి బ్లాక్ అధ్యక్షుడు బెల్లంకొండ వాసు, మాజీ మండల అధ్యక్షుడు పూలపల్లి సుధాకర్ రెడ్డి, పిచ్చిరెడ్డి, రహీం ఖాన్, తిరుపతి చంటి, దామోదర్ రెడ్డి, ప్రభాకర్, లాలయ్య, అనిల్, కిరణ్, నరసింహారావు, ఉండేటి వెంకన్న, కోట నాగిరెడ్డి, వరుసు సైదులు, మాచర్ల శ్రీను,చందు, శ్రీను తదితరులు పాల్గొన్నారు.