15-11-2025 12:25:53 AM
జహీరాబాద్: ఈనెల 15న జరిగే లోక్ అదాలత్ సద్వినియోగం చేసుకోవాలని జహీరాబాద్ రూరల్ ఎస్సై కాశీనాథ్ ఒక ప్రకటనలో తెలిపారు. జహీరాబాద్ కోర్టు నందు వివిధ కారణాల చేత చిన్న చిన్న విషయాలపై గొడవలు పడి కేసులు పెట్టుకున్న వారు కేసులను తొలగించుకునేందుకు లోక్ అదాలత్ లు ఎంతగానో ఉపయోగపడతాయని ఆయన తెలిపారు. రాజీమార్గమే రాజమార్గముగా తెలుసుకొని కేసులను ఉపసర్మాదించుకోవాలని ఆయన పేర్కొన్నారు. చిన్నచిన్న గొడవలతో కేసులు పెట్టుకుని డబ్బులు వృధా చేసుకుని సమయానికి కోర్టుకు వెళ్లి మానసిక ఒత్తిడి గురై అనేక ఆరోగ్య సమస్యలు తెచ్చుకుంటున్నారని అందుకే ఈ లోక్ అదాలత్ ఉపయోగపడుతుందని ఆయన వివరించారు.