calender_icon.png 15 November, 2025 | 9:05 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉత్సాహంగా ఫుడ్ ఎ పెయిర్ 2025

15-11-2025 12:23:23 AM

-హైటెక్స్‌లో ఏర్పాటు చేసిన ప్రదర్శనను ప్రారంభించిన మంత్రి శ్రీధర్‌బాబు

-ఈ నెల 16 వరకు జరగనున్న ఎగ్జిబిషన్

-చెఫ్స్, ఫుడ్ స్టార్టప్స్, తయారీదారులు ఆందరూ ఒకే చోట

-హైదరాబాద్, నవంబర్ 14(విజయక్రాం తి): దక్షిణ భారతదేశంలో ప్రముఖ ఆహార పానీయ ( ఫుడ్ అండ్ బివరేజ్) ట్రేడ్ ఫెయిర్ గా గుర్తింపు పొందిన ఫుడ్ ఎ ఫెయిర్ 2025 నగరంలోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్‌లో ఏర్పాటైంది. ఈ ప్రదర్శనను రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్,కమ్యూనికేషన్స్, ఇండస్ట్రీస్ అండ్ కామర్స్ శాఖ మంత్రి డి. శ్రీధర్‌బాబు ప్రారంభించారు. ఈ సందర్బంగా శ్రీధర్‌బాబు మీడి యాతో మాట్లాడుతూ ఈ రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు, ఆధునిక, స్థిరమైన, ఆవిష్కరణలకు ప్రాధాన్యత నిచ్చే ఫుడ్ ఎకోసిస్టమ్‌ను నిర్మించడానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.

ఫుడ్ ప్రాసెసింగ్, పారిశ్రామిక వేత్తల అభివృద్ధి, టెక్నా లజీ అనుసరణ, మార్కెట్ అభివృద్ధి వంటి కీలక రంగాల్లో దృష్టి సారించడం ద్వారా, ఆహార వ్యవసాయ ఆధారిత పరిశ్రమలకు రాష్ట్రాన్ని ప్రధాన కేంద్రంగా నిలపడమే తమ లక్ష్యంగా పేర్కొన్నారు. హైదరాబాద్‌ను మరిం త ముందుకు తీసుకెళ్లే ముఖ్యమైన అడుగుగా ఈ ఫుడ్ ఎ ఫెయిర్ నిలుస్తోందన్నారు.రిటైల ర్లు, హోల్ సేల్లర్లు, తయారీదారులు, ఫుడ్ ప్రాసెసర్లు, టెక్నాలజీ ఇన్నోవేటర్లు, షెఫ్స్, వంట నిపుణులు, స్టార్టప్లు, కొనుగోలు దారు లు అంతా ఒకే వేదికపైకి రావడం ఈ కార్యక్రమం ప్రత్యేకతగా నిర్వాహకులు పేర్కొన్నా రు.

ఈ నెల 16వ తేదీ వరకు జరుగుతున్న ప్రదర్శనలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బి2బి మీటింగులు, ప్రోడక్ట్ లాంచ్లు, డిమాన్ స్ట్రేషన్స్, ఇండస్ట్రీ ఇంటరాక్షన్లు ఉంటాయని వెల్లడించారు.బ్లిట్జ్ ఎగ్జిబిషన్స్ సంస్థ ఆధ్వర్యం లో నిర్వహిస్తున్న ఈ ఫెయిర్‌కు తెలంగాణ ప్రభుత్వ ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈ శాఖ, తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ, తెలంగాణ షెఫ్స్ అసోసియేషన్ సహకారం అందిస్తున్నాయని అలాగే వైబ్రంట్ ఇండియా, హైటెక్స్‌లు కూడా నిర్వహణలో భాగం పంచుకుంటున్నాయని వివరించారు.

కార్యక్రమంలో ఇండియన్ బ్యాడ్మింటన్ చీఫ్ నేషనల్ కోచ్ పద్మ భూషణ్, పుల్లెల గోపిచంద్, ఐసీఏఆర్‌ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్స్ రీసెర్చ్ డైరెక్టర్ డా. తారా సత్యవతి, ఐసీఏఆర్‌ఐఐఎమ్‌ఆర్ ప్రిన్సిపల్ సైంటిస్ట్,న్యూట్రిహ బ్ సీఈ ఓ జె. స్టాన్లీ, మిల్లెట్ బ్యాంక్ ఫౌండర్ విశాల రెడ్డి, ప్రగతి గ్రూప్ చైర్మన్, జీబీకే రావు తదితరులు పాల్గొన్నారు. 

కాగా ఈ ప్రదర్శనలో కొలువుదీరిన వినూత్న ఉత్పత్తులు, విశేషాలు ఆకట్టుకుంటున్నాయి. వీటిలో ప్లాంట్‌బేస్డ్ ఆహారపదా ర్థాలు, ఆర్గానిక్ అండ్ మిల్లెట్ ఆధారిత ఉత్పత్తులు, ఫంక్షనల్ ఫుడ్స్,తాజా వ్యవసాయ ఉత్పత్తులు, ఫ్రోజెన్ ఫుడ్స్,పాలు, పాల ఆధారిత పదార్ధాలు, మసాలాలు, రెడీటుఈట్ (ఆర్‌టీఈ) ఉత్పత్తులు... వంటివి ఉన్నాయి.