15-05-2025 12:00:00 AM
ఎక్వాయిపల్లిలో మాజీ ఎమ్మెల్యేలు జైపాల్ యాదవ్, గువ్వల బాల్ రాజ్
కడ్తాల్, మే 14 : కేసీఆర్ ప్రభుత్వ హయాంలో రైతులకు న్యాయం జరిగుందని మాజీ ఎమ్మెల్యేలు జైపాల్ యాదవ్, గువ్వల బాల్ రాజ్ అన్నారు. బుధవారం కడ్తాల్ మండలం (ఏ) ఎక్వాయిపల్లి గ్రామంలో రైతుల వద్ద ప్రభుత్వం కొనుగోలు చేస్తున్న కేంద్రాన్ని వారు పరిశీలించారు.
ఈ సందర్బంగా వారు మాట్లాడారు ఎక్వాయిపల్లి గ్రామంలో 5 వేల ఎకరాల పంట నష్టం జరిగిందని వెంటనే ప్రభుత్వం పంట నష్టాన్ని అంచనా వేసి ఎకరాకు రూ. 30 వేల ఆర్థిక సాయం అందించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో సింగల్ విండో చైర్మన్ గంప వెంకటేష్ గుప్తా, రైతు సమన్వయ సమితి మాజీ అధ్యక్షుడు జోగు వీరయ్య, జర్పుల దశరథ్ నాయక్, నరసింహ భరతమ్మ తదితరులు పాల్గొన్నారు.