16-12-2024 12:36:50 AM
భీమదేవరపల్లి, డిసెంబరు 15: సహార సంస్థ బాధితులకు న్యాయం చేయాలని సహార బాధితుల సంఘం జాతీయ అధ్యక్షురాలు పూజితమిశ్రా డిమాండ్ చేశారు. ఆదివారం బాధితుల సంఘం ఆధ్వర్యంలో ముల్కనూ ర్‌లో ర్యాలీ నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆలిండియా జనందోళన సంఘర్షణ సమితి జాతీయ అధ్యక్షురాలు మాట్లాడుతూ.. సహార సంస్థ దేశవ్యాప్తంగా 13 కోట్ల మంది బాధితులకు రూ.86 లక్షల కోట్లు బకాయిలు ఉన్నట్లు వెల్లడించారు. 2012లో సుప్రీంకోర్టు 15 శాతం వడ్డీతో డబ్బులు చెల్లించాలని ఆదేశించిందన్నారు.
సహార సంస్థ మాత్రం వారికి బాండ్‌లు తిరిగి మెచ్యూరిటీ (కాలపరిమితి) మరో 15 ఏళ్లకు పెంచుతూ దగా చేసిందన్నారు. బాధితులకు రూ.10 వేల కోట్లు చెల్లించినట్లు సుప్రీంకోర్టును తప్పుదోవ పట్టించిందన్నారు. తెలంగాణలో సహార నేటికి అక్రమ వ్యాపారం చేస్తుందని, సీఎం రేవంత్‌రెడ్డి జోక్యం చేసుకొని తెలంగాణలోని లబ్ధిదారులకు అన్యాయం జరుగకుండా చూడాలన్నారు.