16-09-2025 01:05:07 AM
నిజామాబాద్/వికారాబాద్, సెప్టెంబర్- 15 (విజయక్రాంతి): కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రీ ప్రైమరీ విద్యా వ్యవస్థను అంగన్‌వాడీ కేంద్రాల్లోనే కొనసాగించాలని, తమ ఉద్యోగాలు రెగ్యులరైజ్ చేసి, రూ.26 వేల వేతనం ఇవ్వాలని, తాము ఎదుర్కుంటున్న సమస్యలు పరిష్కరించాలని డిమాం డ్ చేస్తూ సోమవారం సీఐటీయూ ఆధర్యంలో అంగన్‌వాడీ కార్యకర్తలు ఆందోళన లు చేశారు.
అందులో భాగంగా వికారాబాద్ జిల్లా కొడంగల్‌లోని సీఎం రేవంత్‌రెడ్డి ఇంటిని ముట్టడించారు. సీఎం ఇంటి ఎదుట బైఠాయించి ఆందోళనకు దిగారు. వారిని అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించడంతో ఇరు వర్గాల మధ్య తోపులాట జరి గింది. ఈ క్రమంలో పలువురు అంగన్వాడీలను పోలీసులు అరెస్టు చేశారు. అంగ న్వాడీల రాష్ర్ట ప్రధాన కార్యదర్శి విజయలక్ష్మి మాట్లాడుతూ.. అంగన్‌వాడీలను రెగ్యులరైజేషన్ చేయాలని, ప్రీ ప్రైమరీలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
ప్రీ ప్రైమరీ వ్యవస్థను అంగన్‌వాడీ కేంద్రాల్లోనే కొనసాగించాలని డిమాండ్ చేశారు. విద్య బోధన బాధ్యతను అంగన్వాడీ టీచర్లకు, హెల్పర్లకు ఇవ్వాలన్నారు. విద్యా వాలంటీర్లను నియమించి వారికి అదనంగా వేతనాన్ని చెల్లిం చాలని కోరారు. ఆరు సంవత్సరాలలోపు పిల్లలతో ప్రైవేటు స్కూల్స్ నడపడానికి అనుమతి ఇవ్వొద్దని కోరారు. అంగన్‌వాడీల ఖాళీ పోస్టులు భర్తీ చేయాలని కోరారు.
తమ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం దిగి రాకుంటే అసెంబ్లీని ముట్టడిస్తామని హెచ్చరించారు. తమ ఉద్యోగాలను రెగ్యులరైజేషన్ చేయాలని, రూ.26 వేల వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రధానంగా ఎఫ్‌ఆర్‌ఎస్ రద్దు చేయాలన్నారు. ఇప్పటికే ప్రభుత్వానికి ఎన్నోసార్లు తమ సమస్యలపై విన్నవించినా స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
అయినా తాము శాంతియుతంగా నిరసన చేస్తుంటే పోలీసులు అత్యుత్సాహంతో అడ్డుకుంటున్నారని, అక్రమంగా అరెస్టులు చేస్తు న్నారని వాపోయారు. మక్తల్ పట్టణ కేంద్రం లో అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు మంత్రి వాకిటి శ్రీహరి ఇంటి ముట్టడికి యత్నించా రు. అదే సమయంలో మంత్రి వారిని ఇం ట్లోకి సాదరంగా ఆహ్వానించారు. అయితే తమ సమస్యలు పరిష్కరించాలని వారు మంత్రికి వినతి పత్రం అందజేశారు.
సానుకూలంగా స్పందించిన మంత్రి సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణంలోని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ క్యాంపు కార్యాలయం ఎదుట అంగన్వాడీ టీచర్లు, కార్మికులు, సిబ్బంది ధర్నా చేపట్టారు. నిజామాబాద్ నగరంలోని పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్‌గౌడ్ ఇంటిని అంగన్‌వాడీ కార్యకర్తలు ముట్టడించారు. అనంతరం ఎన్టీఆర్ చౌరస్తాలో మానవహారం నిర్వహించడంతో పోలీసులు అంగన్ వాడీలను అరెస్టు చేశారు.