calender_icon.png 16 September, 2025 | 3:11 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మానవీయ కోణంలో ఆలోచించండి

16-09-2025 12:54:08 AM

మెడికల్ అడ్మిషన్లలో ‘స్థానికత’ జీఓపై కేటీఆర్ విజ్ఞప్తి

హైదరాబాద్, సెప్టెంబర్ 15 (విజయక్రాంతి): మెడికల్ అడ్మిషన్లలో ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన ‘స్థానికత’ జీఓపై మా నవీయ కోణంలో ఆలోచించాలని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. మెడికల్ ఎంట్రెన్స్‌లో అర్హత సాధించినప్పటికీ, రాష్ర్ట ప్రభుత్వం తీసుకొచ్చిన స్థ్ధానికత జీఓ కారణంగా ప్రవేశాలకు అనర్హులుగా మిగిలిపోతున్న తెలంగాణ విద్యార్థుల ఆవేదనపై స్పందించారు.

ఈ సమస్యను ఆయన దృష్టికి తీసుకురావడానికి తెలంగాణ భవన్‌కు వచ్చిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో కేటీఆర్ సమావేశమై పై విధంగా స్పందించారు. వెంటనే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో ఫోన్‌లో మాట్లాడారు. ఈ సమస్యను సానుకూలంగా పరిశీలించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి వి జ్ఞప్తి చేశారు. కాగా వక్ఫ్ సవరణ చట్టం 2025పై సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులను స్వాగతిస్తూ కేటీఆర్ కృతజ్ఞతలు తెలిపారు.