calender_icon.png 16 September, 2025 | 7:34 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో రికార్డు

16-12-2024 12:37:38 AM

ఈ ఏడాదిలో ఇప్పటివరకు 17,210 కేసుల పరిష్కారం

బాధితులకు లోక్‌అదాలత్ ద్వారా రూ.33.27 కోట్ల రీఫండ్ 

టీజీసీఎస్బీ డైరెక్టర్ శిఖాగోయల్

హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 15 (విజయక్రాంతి): తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో(టీజీసీఎస్బీ) మరో రికార్డు సృష్టించింది. కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న కేసుల పరిష్కారానికి సుప్రీంకోర్టు ఈ నెల 14న జాతీయ లోక్‌అదాలత్ నిర్వహించిన విష యం తెలిసిందే. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపో యిన 4,893 బాధితులకు లోక్‌అదాలత్ ద్వారా పెండింగ్‌లో ఉన్న కేసులను పరిష్కరించి, స్కామర్ల ఖాతాల్లో స్తంభింపజేసిన రూ. 33.27 కోట్లు రీఫండ్ చేసింది.

కాగా, గత సెప్టెంబర్ నెలలో నిర్వహించిన లోక్‌అదాలత్ ద్వారా రూ.27.2 కోట్లు బాధితులకు అందజేసింది. ఈసారి గతంలో కంటే అదనం గా నగదు రికవరీ చేసి, బాధితులకు ఇప్పించినట్లు టీజీసీఎస్బీ డైరెక్టర్ శిఖా గోయల్ ఆదివారం ఓ ప్రకటన ద్వారా తెలిపారు. ఈ ఏడాదిలో 17,210 మంది బాధితుల పెండింగ్ కేసులను పరిష్కరించి రూ. 155.22 కోట్లు రీఫండ్ చేసినట్లు పేర్కొన్నారు. సైబరాబాద్ కమిషనరేట్‌లో 2,136 కేసులు, హైదరాబాద్ కమిషనరేట్‌లో 268, రాచకొండ కమిషనరేట్‌లో 592, టీజీసీఎస్బీ హెడ్ క్వార్టర్స్ పరిధిలోని 60 కేసులు, సంగారెడ్డిలో 188 కేసులను పరిష్కరించనట్లు చెప్పారు.