calender_icon.png 22 May, 2025 | 1:45 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీసీ విద్యార్థులకు న్యాయం చేయాలి

22-05-2025 12:36:35 AM

-ఇంజినీరింగ్ విద్యలో బీసీ విద్యార్థులకు 10 వేల ర్యాంకు నిబంధన ఎత్తివేయాలి

- బీసీ విద్యార్థి సంఘం జాతీయ అధ్యక్షుడు విక్రమ్ గౌడ్

ముషీరాబాద్, మే 21 (విజయక్రాంతి): 2008లో అప్పటి ప్రభుత్వంతో కొట్లాడి ఫీజుల రియంబర్స్మెంట్ స్కీమ్ సాధించామని బీసీ విద్యార్థి సంఘం జాతీయ అధ్యక్షుడు తాటికొండ విక్రం గౌడ్  అన్నారు. బీసీ ఈ లో ఉన్న  ముస్లిం, మైనారిటీలకు ర్యాంకులతో సంబంధం లేకుండా పూర్తి ఫీజులు ఇస్తున్నారని, కానీ బీసీ విద్యార్థులకు మాత్రం  10 వేల ర్యాంకు నిబంధిన పెట్టి మిగిలిన వారికి కేవలం రూ.35 వేలు మాత్రమే ఇస్తున్నారని వారు మండిపడ్డారు.

ఈ మేరకు బుధవారం దోమలగూడలోని బీసీ భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీసీ విద్యార్థులకు పదివేల ర్యాంకు నిబంధన వల్ల   టాప్ టెన్ కాలేజెస్ లో బీసీ విద్యార్థులకు సీట్లు వచ్చిన అట్టి ఫీజులు లక్ష నుంచి 2 లక్షలు ఉండడంతో కట్టలేక చదువుకు దూరం అవుతున్నారని  ఆవేదన వ్యక్తం చేశారు.

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడితే బీసీ విద్యార్థులకు ర్యాం కు నిబద్ధత ఎత్తివేస్తామని, మిగతా  ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ విద్యార్థుల, బీసీ విద్యార్థులకు కూడా పూర్తి ఫీజులు చెల్లిస్తామని కామారెడ్డి డిక్లరేషన్ తో పాటు కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టారని కాబట్టి వెంటనే ఈ పదివేల ర్యాంకు నిబద్ధత ఎత్తివేసి బీసీ విద్యార్థులకు న్యాయం చేయాలన్నారు. 

లేదంటే వేలాది మంది విద్యార్థులతో పెద్ద ఉద్యమాన్ని నిర్మిస్తామని విక్రమ్ గౌడ్ హెచ్చరిం చారు. ఇంజినీరింగ్ బి క్యాటగిరి దోపిడిని అరికట్టాలని, న్యాయమైన ర్యాంకులు వచ్చి న వారికే బి కేటగిరిలో సీట్లు ఇవ్వాలని కానీ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలో ఒక మాఫియాలా తయారై కనీసం ఎప్ సెట్‌లో క్వాలి ఫై కానీ వారికి కూడా మార్కెట్లో కూరగాయల సీట్ల ను అమ్ముకుంటున్నారని, దీనిపై ప్రభుత్వం వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని  కోరా రు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ కులకచర్ల శ్రీనివాస్ ముదిరాజ్, బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గొడుగు మహేష్ యాదవ్, బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు ఇంద్రం రజక ముఖ్య నాయకులు పాల్గొన్నారు.