22-05-2025 12:34:24 AM
-బీసీ, ఎస్సీ. ఎస్టీ, మైనారిటీ ప్రజాసంఘాలు
ముషీరాబాద్, మే 21 (విజయక్రాంతి): హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో ఐఎన్‌టీయూసీ (ఆర్) జాతీయ అధ్యక్షుడు అంబటి కృష్ణ మూర్తి పై దాడి గర్హనీయమని, ఈ దాడిని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని బిసి, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ ప్రజాసం ఘాల నేతలు జెబి రాజు, సత్యం, పోకల కిరణ్, నాగుల శ్రీనివాస్ యాదవ్, జేమ్స్, భూదాల అమర్ బాబు, గొల్లపల్లి దయానంద, నాగరాజు, కృష్ణ గౌడ్, జనార్ధన్, బండారు శైలజ, పి అరుణ, జ్యోతి, సత్యదేవ్ అన్నారు.
ఐఎన్‌టీయూసీ (ఆర్) హైదరాబాద్ జిల్లా కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో వారు మాట్లాడుతూ ఐఎన్‌టీయూసీ జాతీయ అధ్యక్షుడిగా చెప్పుకుం టున్న జి. సంజీవ రెడ్డి అనుచర గుండాలు ఆర్‌డీ చంద్రశేఖర్ ఇంకా కొంతమంది అంబటి కృష్ణ మూర్తి ఆయన కార్యవర్గ సభ్యులపై దౌర్జన్యంగా కేకలు వేస్తూ భౌతిక దాడులకు పాల్పడడం దుర్మార్గమన్నారు.
గత15 సంవత్సరాలుగా కార్మిక వర్గంలో ముఖ్యంగా అసంఘటిత రంగంలో అంబటి కృష్ణ మూర్తి పనిచేస్తూ రోజురోజుకు ఆదరణ పెరగడం చూసి ఈర్షతో కుట్రతో దాడి చేసిన విధానాన్ని కార్మిక సంఘాలు ప్రజా సంఘాలు బీసీ ఎస్సీ ఎస్టీ మిగతా వివిధ కార్మిక సంఘాలు తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రజాస్వామ్యా న్ని బతికించవలసిం దిగా విజ్ఞప్తి చేశారు.
ఒక బీసీ నాయకుడు జాతీయస్థాయిలో నాయకుడిగా ఎదగటానికి సహించలేని అగ్రవర్ణాల తొత్తులైన జి. సంజీవ రెడ్డి రౌడీ మూకలు దాడులు చేయడం సిగ్గుచేటన్నారు. అంబటి కృష్ణ మూర్తి పై దాడి మొత్తం అణుగారిన వర్గాల మీద జరిగిన దాడిగా వర్ణించారు. ఈ దాడిని ఒక పిరికిపంద దాడిగా వర్ణిస్తూ ఇటువంటి ప్రజాస్వామ్యంలో ఉండకూడదని, దోషులను చట్టపరమైన శిక్షను విధించవల సిందిగా తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా వారు విజ్ఞప్తి చేశారు.