19-08-2025 01:37:34 PM
న్యూఢిల్లీ: ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా మంగళవారం జస్టిస్ బి. సుదర్శన్ రెడ్డి(Justice B. Sudershan Reddy)ని విపక్షాలు ప్రకటించాయి. కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే(Congress chief Mallikarjun Kharge) నివాసంలో జరిగిన సమావేశంలో ఈ ప్రకటనను వెల్లడించారు. ప్రస్తుతం సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తిగా ఉన్న సుదర్శన్ రెడ్డి.. తాజాగా ఇండి కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా సేవలు అందించనున్నారు. 2007-11 మధ్య సుప్రీంకోర్టు జడ్జీగా జస్టిస్ బి. సుదర్శన్ రెడ్డి సేవాలు చేశారు. ఈయన గోవా తొలి లోకాయుక్తగా కూడా సేవలందించారు. 2005లో గువాహటి హైకోర్టు సీజేగా సుదర్శన్ రెడ్డి సేవాలు చేశారు. తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా ఆకులామైలారం సుదర్శన్ రెడ్డి యొక్క స్వస్థలం. 1971లో ఉస్మానియా వర్సిటీలో లా చదివారు. కాగా, ఎన్డీయే ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా మహారాష్ట్ర గవర్నర్ సి.పి. రాధాకృష్ణన్ ప్రకటించిన విషయం తెలిపిందే. ఉపరాష్ట్రపతి పదవికి ఎన్డీఏ ఎంపిక చేసిన మహారాష్ట్ర గవర్నర్ సి.పి. రాధాకృష్ణన్‌పై సుదర్శన్ రెడ్డి పోటీ చేస్తారు.