calender_icon.png 13 January, 2026 | 9:37 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉరిమిన కబడ్డీ ఉత్సాహం… మాచపూర్ మైదానంలో హోరాహోరీ

13-01-2026 08:06:14 PM

24 జట్లు… విజయం కోసం ఉత్కంఠ పోరు

ఎల్లారెడ్డి,(విజయక్రాంతి): సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ఎల్లారెడ్డి మండలం మాచపూర్ గ్రామంలో గ్రామ సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్, ఉప సర్పంచ్ గంగవ్వ అధ్యక్షతన పాలకవర్గ ఆధ్వర్యంలో గ్రామ యూత్ సహకారంతో నిర్వహిస్తున్న నియోజకవర్గ స్థాయి కబడ్డీ పోటీలు మంగళవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. స్థానిక ఎమ్మెల్యే మదన్ మోహన్ ఆదేశాల మేరకు మార్కెట్ కమిటీ చైర్మన్ రజిత వెంకటరామిరెడ్డి, డీఎస్పీ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఈ క్రీడా వేడుకలు ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు కొబ్బరికాయలు కొట్టి పోటీలను అధికారికంగా ప్రారంభించారు. డీఎస్పీ శ్రీనివాసరావు స్వయంగా మైదానంలోకి వెళ్లి కబడ్డీ ఆడి క్రీడాకారులను ఉత్సాహపరచడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

ఈ పోటీల్లో మొత్తం 24 కబడ్డీ జట్లు పాల్గొంటున్నట్లు నిర్వాహకులు  తెలిపారు. విజేతలకు మొదటి బహుమతిగా రూ.15,555/- నగదు, రెండో బహుమతిగా రూ.8,888/- అందజేయనున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు. గ్రామీణ యువతలో క్రీడాస్ఫూర్తిని పెంపొందించడమే లక్ష్యంగా ఈ పోటీలు నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్సై బొజ్జ మహేష్, రెండవ ఎస్సై సుబ్రహ్మణ్య చారి, మాజీ సర్పంచ్ నారా గౌడ్, నర్సింహారెడ్డి, మండల మైనారిటీ ఉపాధ్యక్షులు యం.డి. యాసిన్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, గ్రామ పెద్దలు, స్థానిక యువకులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.