13-01-2026 08:08:16 PM
నాగిరెడ్డిపేట,(విజయక్రాంతి): మండలంలోని వెంకంపల్లి గ్రామంలో జొన్న పంటను మంగళవారం స్థానిక మండల వ్యవసాయ అధికారి సాయి కిరణ్ పరిశీలించారు.ఈ సందర్భంగా ఏవో సాయికిరణ్ మాట్లాడుతూ... మండలంలో యాసంగిలో సుమారు 500 ఎకరాల్లో జొన్నను పంటను రైతులు సాగు చేస్తున్నారని తెలిపారు. రైతులు పంట సంరక్షణ, యాజమాన్య పద్ధతులపై దృష్టి సారించాలనీ, జొన్న పంటలో కాండం తొలిచే పురుగు యాసంగిలో ఎక్కువగా కనిపిస్తుంది. రైతులు తమ పొలాల్లో గమనించినట్లైతే ఒక పంపుకు 6 నుంచి 8 ml అనగా ఎకరాకు 60 ml చొప్పున క్లోరాంట్రానిలిప్రోల్ 18.5% SC మందుని పిచికారి చేసుకోవాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో రైతులు తదితరులు పాల్గొన్నారు.