calender_icon.png 6 October, 2025 | 5:04 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దేశంలోనే అత్యున్నత సేవలందించిన మహోన్నత వ్యక్తి కాకా

06-10-2025 12:12:18 AM

పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు

సుల్తానాబాద్, అక్టోబర్ 5 (విజయ క్రాంతి):దేశంలోనే అత్యున్నత స్థానం లో సేవలందించిన మహోన్నత వ్యక్తి కేంద్ర మాజీమంత్రి , దివంగత కాకా వెంకట స్వామి నీ స్ఫూర్తిగా తీసుకొని ముందుకు వెళ్లాలని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు అ న్నారు.. ఆదివారం సుల్తానాబాద్ ప ట్టణం లో వెంకటస్వామి 96వ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు..

అనంతరం కేక్ కట్ చేశారు.. ఈ సందర్భంగా మాట్లాడు తూ బడుగు బలహీన వర్గాల ప్రజల్లో వెలుగులు నింపిన వ్యక్తి కాకా అని అన్నారు, కార్మికుల పక్షాన అనేక ఉద్యమాలు నిర్వహించి లక్షలాదిమంది కార్మికుల జీవితాలకు బాటలు వేశారని అన్నారు.. కార్యక్రమంలో గ్రంధాలయ సంస్థ చైర్మన్ అంతటి అన్నయ్య గౌడ్ , మార్కెట్ చైర్మన్ మినుపాల ప్రకాష్ రావు, సింగిల్ విండో చైర్మన్ శ్రీగిరి శ్రీనివాస్, గాజుల రాజమల్లు ,

మున్సిపల్ కమిషనర్ రమేష్ , కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎండి సజ్జత్, గోపగాని సారయ్య గౌడ్ , కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు వేగోళం అబ్బయ్య గౌడ్, బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ధనాయక్ దామోదర్ రావు, సాయిరి మహేందర్, కందుకూరి ప్రకాష్ రావు (పెద్దన్న ), పడాల అజయ్ గౌడ్ , పన్నాల రాములు, బిరుదు కృష్ణ , ముత్యాల రవీందర్, గరిగే శ్రీనివాస్, పల్లా సురేష్ , ఉస్తేం గణేష్ , అమిరీశెట్టి రాజలింగం , తిరుపతి , కోడి కనకయ్య , అమినోద్దీన్ (నన్ను), తొర్రికొండ ప్రభాకర్, గాదాస్ రవీందర్, ప లువురుపాల్గొన్నారు.