calender_icon.png 6 October, 2025 | 2:25 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గెలుపే లక్ష్యంగా పనిచేయాలి

06-10-2025 12:08:53 AM

బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య

ఎల్లారెడ్డిపేట, అక్టోబర్5, (విజయక్రాంతి)  స్థానిక సంస్థల ఎన్నిల్లో బీఆర్‌ఎస్ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా పని చేయాలని బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఆదివారం మండల కేంద్రంలోని స్టార్ ఫంక్షన్ హాల్లో బీఆర్‌ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ఎంపీటీసీ ఎన్నికల నేపథ్యంలో 13 ఎంపీటీసీ స్థానాలకు ఒక్కో స్థానానికి సగటున ముగ్గురికంటే ఎక్కువ మంది టికెట్ ఆశిస్తున్నారని తెలిపారు.

ఇటీవల పలు సర్వే సంస్థలు, పార్టీ సర్వేల ప్రకారం 95 శాతానికి పైగా సీట్లు బీఆర్‌ఎస్ పార్టీ గెలుస్తుందని చెప్పినట్లు గుర్తు చేశారు. ఈ సందర్భంగా పార్టీ విధేయులు, సమర్థులు, ప్రజాసంబంధాలు కొనసాగిస్తూ ప్రజాసమస్యలు పరిష్కరించడంలో చొరవ చూపుతున్న కార్యకర్తలకు టికెట్లు కెటాయింపు చేసేందుకు ప్రయత్నం జరుగుతుందని టికెట్ లభించని వారు నిరాశ పడవద్దని వారం దరినీ పార్టీ ఆధరిస్తుందని తెలిపారు.

రానున్న ప్రభుత్వం మల్లీ బీఆర్‌ఎస్దేనని గుర్తుంచుకోవాలని తెలిపారు. కాంగ్రేస్ పార్టీ ఇచ్చిన హామీలు మరిచిన విశయం తెలిపేభాకీ కార్డులపై గ్రామాల్లో ప్రజలకు అవగాహన కల్పించాలని చెప్పారు. జడ్పీటీసీ స్థానానికి చీటి రజిత-లక్ష్మణ్రావు, గుండారపు లహరి-కృష్ణారెడ్డి, పాశం సరోజన-దేవరెడ్డి, గుల్లపల్లి పద్మ-నర్సింహారెడ్డి, ఇల్లెందుల గీతాంజల-శ్రీనివాస్రెడ్డి ఆశావాలుగా ఉన్నట్టు గుర్తించామని అన్నారు.

పోటీలో ఇంకెవరైనా ఉంటే తమకు తెలుపాలని అన్ని విశయాలను పరిగణలోకి తీసుకుని టికెట్లు కేటాయింపు ఉంటుందని పార్టీ టికెట్ ఎవరికి కేటాయిస్తే వారిని గెలిపించేందుకు కృషిచేయాలన్నారు. ఇక్కడ బీఆర్‌ఎస్ మండలాధ్యక్షుడు వర్స కృష్ణహరి, పీఏసీఎస్ చైర్మన్ గుండారపు కృష్ణారెడ్డి, నాయకులు అందె సుభాశ్, ఎడ్ల సందీప్ తదితరులు ఉన్నారు.