19-12-2025 09:41:45 AM
హైదరాబాద్: పబ్లిక్ సర్వీస్ కమిషన్ల సదస్సును(Public Service Commission Conference) రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శుక్రవారం ప్రారంభించనున్నారు. ద్రౌపది ముర్ము(President Droupadi Murmu) రామోజీ ఫిల్మ్ సిటీని సందర్శించనున్న నేపథ్యంలో రాచకొండ పోలీస్ కమిషనరేట్ ట్రాఫిక్ సలహాను జారీ చేసింది. వీవీఐపీ/వీఐపీల రాకపోకల కారణంగా, ఉప్పల్ ట్రాఫిక్ పోలీస్ పరిధిలోని పలు కూడళ్లు, యూ-టర్న్‌ల వద్ద ట్రాఫిక్ రద్దీ ఏర్పడే అవకాశం ఉంది. ఉదయం 8:00 గంటల నుండి సాయంత్రం 4:30 గంటల మధ్య కింది ప్రదేశాలలో ట్రాఫిక్‌ను తాత్కాలికంగా నిలిపివేయవచ్చు లేదా దారి మళ్లించవచ్చని అధికారులు పేర్కొన్నారు.
నాగోల్ మూసీ వంతెన, నాగోల్ మెట్రో యు-టర్న్, రాజ్యలక్ష్మి యు-టర్న్, ఉప్పల్ ఎక్స్ రోడ్ (వరంగల్ వైపు), హోటల్ 2020 ప్రాంతం, LFJC యు-టర్న్, సర్వే ఆఫ్ ఇండియా సిగ్నల్, రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం లేన్, ఈకే మినార్ యు-టర్న్ వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయి. ప్రయాణికులు తమ ప్రయాణాలను ముందుగానే ప్లాన్ చేసుకోవాలని, వీలైతే నిర్దేశిత సమయాల్లో ప్రభావిత మార్గాలను నివారించాలని, విధుల్లో ఉన్న ట్రాఫిక్ పోలీసు సిబ్బందికి సహకరించాలని అధికారులు సూచించారు.