calender_icon.png 19 December, 2025 | 5:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మళ్లీ వచ్చేది కేసీఆర్ ప్రభుత్వమే

19-12-2025 01:42:20 AM

పల్లె పోరులోరేవంత్‌కు దిమ్మతిరిగే తీర్పు 

బీఆర్‌ఎస్ సర్పంచులకు అండగా ఉంటా: మాజీ మంత్రి హరీశ్‌రావు

మెదక్, డిసెంబర్ 18(విజయక్రాంతి): రెండేళ్లలో మళ్ళీ వచ్చేది కేసీఆర్ ప్రభుత్వమేనని, ప్రజలంతా కేసీఆర్ సీఎం కావాలని కో రుకుంటున్నారని మాజీ మంత్రి హరీశ్‌రావు తెలిపారు. గురువారం ఆయన మెదక్ జిల్లా కేంద్రంలో పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన నూతన సర్పంచ్‌ల సన్మాన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. సర్పంచ్ ఎన్నికల్లో పల్లె ప్రజలు సీఎం రేవంత్ కు దిమ్మతిరిగే తీర్పునిచ్చారన్నారు.

కాంగ్రెస్ అధికారంలో ఉన్నా బీఆర్‌ఎస్ 40 శాతం సర్పంచ్ స్థానాలను గెలవడం రేవంత్ రెడ్డి పతనానికి, పల్లె ప్రజల తిరుగుబాటుకు నిదర్శనమన్నారు.పెన్షన్లు, రుణమాఫీకి పైసలు లేవు కానీ.. మెస్సీ కోసం, అందాల పోటీల కోసం రేవంత్ రెడ్డి వందల కోట్లు ఖర్చు చేశాడని హరీశ్‌రావుఆరోపించారు. రెండేళ్లలో మళ్ళీ వచ్చేది కేసీఆర్ ప్రభుత్వమే.. సచి వాలయం పైన ఎగిరేది గులాబీ జెండానే అ న్నారు. రానున్న జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో రేవంత్ రెడ్డికి మైండ్ బ్లాక్ అవడం ఖా యమన్నారు.

బీఆర్‌ఎస్ సర్పంచ్ విజయం చూసి ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు పెట్టే ధైర్యం రేవంత్ రెడ్డి చేయడన్నారు.42 శాతం బీసీ రిజర్వేషన్ అని మోసం చేశాడని, రైతుబంధు, రైతులకు యూరియా ఇయ్యకుండా తిప్పలు పెట్టాడని దుయ్యబట్టారు. అన్ని పథకాలు గంగలో కలిపారని, రైతుల గోస మామూలుగా లేదన్నారు. ఆర్థిక సంఘం డబ్బులు నేరుగా 80 శాతం గ్రామ పంచాయతీలకు వస్తాయని, ఇందులో ప్రభుత్వ పార్టీ ప్రమేయం ఉండదన్నారు.

గెలుపొందిన సర్పంచ్‌లు గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఫుట్ బా ల్ షోకుల కోసం ఐదు కోట్లతో గ్రౌండ్ కట్టించుకోవడం కాదు.. మెస్సీతో ఫుట్ బాల్ ఆడ డానికి రూ 100 కోట్లు ఖర్చు చేశాడని, అందాల పోటీ కోసం 100 కోట్లు ఖర్చు.... నువ్వు, నీ మనుమడు క్రికెట్ ఆడడానికి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తారా? అని హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.

అధికారులు న్యాయంగా, ధర్మంగా పనిచేయాలని, ఏకపక్షంగా పనిచేస్తే బీఆర్‌ఎస్ ప్రభుత్వం వచ్చాక మీ పని పడతామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు పద్మా దేవేందర్ రెడ్డి, పట్లోళ్ల శశిధర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి, రాష్ట్ర నాయకులు కంఠారెడ్డి తిరుపతి రెడ్డి, దేవేందర్ రెడ్డి, మల్లిఖార్జున్ గౌడ్, తాడేపు సోములు, హన్మంత్ రెడ్డి, కృష్ణారెడ్డి, అంజాగౌడ్, మామిళ్ళ ఆంజనేయులు, లింగారెడ్డి, బట్టి ఉదయ్ తదితరులు ఉన్నారు.

‘పంచాయతీ’ ఫలితాలతో రేవంత్‌కు ఫ్రస్ట్రేషన్ పీక్స్

పంచాయతీ ఎన్నికల ఫలితాలు చూసిన రేవంత్ రెడ్డి ఫ్రస్టేషన్ పీక్స్‌కు చేరిందని మాజీ మంత్రి హరీశ్‌రావు ఫైర్ అయ్యారు. ఈ మేరకు గురువారం సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలపై ఆయన స్పందించారు.  తనకు, కేటీఆర్‌కు మధ్య మిత్ర బేధం సృష్టించాలని, తద్వారా బీ ఆర్‌ఎస్‌ను బలహీన పరచాలని ఒక ఛీప్ ట్రిక్ ప్లే చేస్తున్నారని  ఆరోపించా రు. ‘అనేక సార్లు చెప్పినా, మళ్లీ చెబుతున్నా.. రాసి పెట్టుకో రేవంత్ రెడ్డి.. ఎప్పటికైనా హరీశ్ రావు గుండెల్లో ఉం డేది కేసీఆరే.

హరీశ్ రావు చేతిలో ఉండే ది గులాబీ జెండానే’ అనే వెల్లడించారు. మీ చిల్లర వేషాలు, చెత్త రాజకీయాలను చూసి ప్రజలు ఛీ కొడుతున్నారని, ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోవాలని, మిగిలిన కొద్ది కాలమైనా సరిగా వినియోగించుకోవాలని హితవు పలికారు. కమీషన్లు, రియల్ ఎస్టేట్ దందాలే కాదు.. ప్రజలకు అక్కరకు వచ్చే పనులు చేయాలని సూచించారు. లేకుంటే ఉద్యమ ద్రోహి గానే కాదూ, చేవలేని, చేతగాని ముఖ్యమంత్రిగా కూడా చరిత్రలో నిలిచిపోత వని హెచ్చరించారు.