15 April, 2026 | 12:56 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

కాళేశ్వరం ఈఈ నూనె శ్రీధర్‌కు బిగుస్తున్న ఉచ్చు

15-06-2025 12:51 AM

- ఏసీబీ దర్యాప్తులో సంచలన విషయాలు

- రూ.150 కోట్లకు పైగా ఆస్తులు

- ఈఎన్సీ అనిల్‌తో సంబంధాలపై ఆరా

హైదరాబాద్, సిటీబ్యూరో జూన్ 14 (విజయక్రాంతి): కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రా జెక్ట్‌లో కీలకపాత్ర పోషించిన నీటిపారుదల శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ నూనె శ్రీధర్‌పై ఏసీబీ ఉచ్చు బిగుస్తోంది. ఆదాయానికి మిం చి రూ.150 కోట్లకు పైగా అక్రమాస్తులు కూడబెట్టిన ఆరోపణలతో గురువారం శ్రీధర్‌ను రిమాండ్‌కు తరలించిన ఏసీబీ, శుక్ర వారం ఆయ న్ను విచారణ కోసం కస్టడీకి ఇ వ్వాలని కో ర్టులో పిటిషన్ దాఖలు చేసింది.

హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, సిద్దిపేటలలో శ్రీధర్‌కు చెందిన విలువైన ఆస్తు లను గుర్తించిన ఏసీబీ, ప్రభుత్వ ప్రాజెక్టులలో ఆ యన పెద్ద ఎతు న అవినీతికి పా ల్పడినట్టు ఆరోపిస్తోంది. జూన్ 9న శ్రీధర్‌పై అ క్రమ ఆస్తుల కే సు నమోదు చేసిన ఏసీబీ, జూన్ 11న హైదరాబాద్, కరీంనగర్, సిద్దిపేటలలోని 12 ప్రాంతాల్లో సోదా లు నిర్వహించింది. ఈ సోదాల్లో తెల్లాపూర్‌లో విల్లా, షేక్‌పేటలో 4,500 చదరపు అడుగుల లగ్జరీ ఫ్లాట్, మలక్‌పేటలో నాలుగంతస్తుల భవనం, వరంగల్‌లో మూడం తస్తుల భవనం, కరీంనగర్‌లో మూడు ఫ్లాట్లు, హైదరాబాద్, వరంగల్, కరీంనగర్‌లో 19 రెసిడె న్షియల్ ప్లాట్లు, 16 ఎకరాల వ్యవసాయభూమి, కరీంనగర్‌లో హోటళ్లలో భాగస్వామ్యం, బంగారు ఆభరణాలు, బ్యాం కు డిపాజిట్లు సహా రూ.150 కోట్లకు పైగా మార్కెట్ విలువ కలిగిన ఆస్తులను గుర్తించా రు. శ్రీధర్ తన కుమారుడి వివాహం కోసం థాయ్‌లాండ్‌లో కోట్ల రూపాయలు ఖర్చు చేసిన ట్టు కూడా తేలింది. అయితే శ్రీధర్ అక్రమాస్తుల కేసులో మరికొంతమంది అధికారుల పాత్ర ఉందని ఏసీబీ అనుమాని స్తోంది. ముఖ్యంగా, ఇంజినీర్ -ఇన్-చీఫ్ (ఈఎన్సీ) అనిల్‌తో శ్రీధర్ సంబంధాలపై నిశి తంగా దర్యాప్తు జరుపుతోంది. 

కాళేశ్వరం ప్రాజెక్ట్ చైర్మన్ రాహుల్ బొజ్జా, శ్రీధర్‌ను ఇరిగేషన్ చీఫ్ ఆఫీస్‌లో రిపోర్ట్ చేయాలని ఆదేశించినప్పటికీ, శ్రీధర్ ఆ ఆదేశాలను ధిక్కరించి, చొప్పదండిలో ఏడాది పాటు ఈఈ గా కొనసాగారు. ఈఎన్సీ అనిల్ ఆదేశాల వల్లే శ్రీధర్ అక్కడే విధులు నిర్వహించినట్టు ఏసీబీ అధికారులు అనుమానిస్తున్నారు. ఈ సందర్భంగా అనిల్‌తో శ్రీధర్ వ్యవహారాలను లోతుగా పరిశీలిస్తున్నారు. శ్రీధర్ కాళే శ్వరం ప్రాజెక్ట్‌లో గాయత్రి, నంది మేడారం పంప్‌హౌస్‌ల ఇన్-చార్జిగా పనిచేశారు.

2019 లో ప్రాజెక్ట్‌లో లీకేజీల ఫిర్యాదులపై శ్రీధర్ నివేదిక సమర్పించి, లీకేజీలు లేవని తేల్చా రు. అయితే, ప్రాజెక్ట్‌లో అవినీతి ఆరోపణలు తీవ్రంగా ఉన్నాయి. మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్ అధినేత కే చంద్రశేఖర్‌రావును కూడా ఈ ప్రాజెక్ట్‌లో జరిగిన అవినీతిపై పీసీ ఘోష్ కమిషన్ ప్రశ్నించింది. శ్రీధర్ అక్రమ ఆస్తుల కేసు ఈ ప్రాజెక్ట్‌లోని అవినీతి కోణాలను మరింత బహిర్గతం చేసే అవకాశం ఉంది. ఏసీబీ శ్రీధర్‌ను వారం రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని కోర్టును కోరింది. బ్యాంకు లాకర్లను తెరిచి, బినామీ లావాదేవీలు, ఆస్తులకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలను పరిశీలించనుంది. శ్రీధర్‌తో పాటు ఇతర అధికారుల పాత్రను కూడా లోతుగా విచారించేందుకు ఏసీబీ సిద్ధమవుతోంది.