calender_icon.png 10 September, 2025 | 10:41 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రచనలతో ప్రజల్లో స్ఫూర్తి నింపిన వ్యక్తి కాళోజీ

10-09-2025 01:26:04 AM

మలక్‌పేట్, సెప్టెంబర్ 9 (విజయక్రాంతి) : తెలంగాణ ఉద్యమం ఊపిరిగా జీవించిన ప్రజాకవి కాలోజీ తన రచనల ద్వారా ప్రజల్లో స్ఫూర్తినింపారని టి ఎమ్ ఆర్ ఎస్ సైదాబాద్ 1 బాలుర రెసిడెన్షియల్ స్కూల్ తెలుగు ఉపాధ్యాయురాలు శ్రీలత అన్నారు.

రెసిడెన్షియల్ స్కూల్ ప్రిన్సిపల్ కే విద్యాసాగర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజా కవి, పద్మ విభూషణ్ స్వర్గీయ కాళోజీ నారాయణ రావు 111వ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

తెలంగాణ భాషా దినోత్సవం సందర్భంగా స్కూల్ లోని విద్యార్థులకు సాంస్కృతిక, వ్యాసరచన పోటీలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రవి, పి. శంకర్, సుజాత, నికిత,  మాధవి,  అశ్విన్, రాజేష్, గౌసుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.