calender_icon.png 10 September, 2025 | 6:24 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హైడ్రా కమిషనర్‌తో ప్రాణహాని ఉంది

10-09-2025 01:23:35 AM

సామాజిక వేత్త, హైకోర్ట్ న్యాయవాది సుంకర నరేష్

ముషీరాబాద్, సెప్టెంబర్ 9(విజయక్రాంతి): వర్టెక్స్ వర్మా అనే రియల్టర్ తో హైడ్రా కమిషనర్ ఎ.వి.రంగనాధ్ కుమ్మక్కయ్యి తనపై తప్పుడు కేసులు బనాయిం చడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని సామాజిక వేత్త, హైకోర్టు న్యాయవాది సుంకర నరేష్ అన్నారు.

తాను ఫేక్ సర్టిఫికెట్స్ సమర్పించానని, నకిలీ న్యాయవాదినని, బార్ కౌన్సిల్ నుంచి సస్పెండ్ చేశారంటూ పత్రికల్లో తప్పుడు ప్రకటనలు హైడ్రా కమిషనర్ ఇప్పిస్తూ తన ప్రతిష్ట దిగజారేలా విషపూరిత ప్రచారం చేయిస్తున్నాడని ఆరోపించారు. తన సస్పెన్షన్ విషయంపై తాను హైకోర్టులో స్టే తీసుకున్నట్లు తెలిపారు.

ఈ మేరకు మంగళవారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో అయన మీడియాతో మాట్లాడారు. తుక్కుగూడలో తన క్లయింట్ చైతన్య రెడ్డి చెందిన 7 ఎకరాల 10 గుంటల స్థలంలో కొంత భాగాన్ని ఆక్రమించి వర్టెక్స్ వర్మ అనే రియల్టర్ రోడ్డు నిర్మించాడని ఆరోపించారు. ఈ విషయం ఒక యూట్యూబ్ ఛానల్‌లో ప్రసా రమై వైరల్ కావడంతో జీర్ణించుకోలేని వర్టెక్స్ వర్మ తనపై కక్ష కట్టాడు అని అన్నాడు.

ల్యాండ్ సెటిల్మెంట్ కోసం తాను చైతన్య రెడ్డిని రూ.50 లక్షలు డిమాండ్ చేసినట్లు హైడ్రా కమిషనర్ రంగనాథ్ ప్రోధ్బలంతో హైడ్రా ఎసిపితో ఫిర్యాదు చేయించినట్లు తెలిపారు. వర్టెక్స్ వర్మకు వత్తాసు పలుకుతూ అతడిని కాపాడేందుకు రంగనాథ్ ప్రయత్నిస్తున్నాడని అన్నారు. ఈ ఫిర్యాదుతో తన క్లయింట్ చైతన్య రెడ్డికి సంబంధం లేదన్నారు.

ప్రస్తుతం చైతన్య రెడ్డి అజ్ఞాతంలో ఉన్నారని, ఆమె బయటికి వస్తే నిజానిజాలు బయట పడతాయని తెలిపారు. ఎలాంటి ఆధారాలు లేకుండా హైడ్రా తనపై ఫిర్యాదు చేసినందుకు తాను కోర్టును ఆశ్రయించానని తెలిపారు. హైడ్రా కమిషనర్ తో తనకు ప్రాణహని ఉందన్నారు. ఈ విషయంపై ఈడి, ఏసీబీ, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ కు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.