calender_icon.png 3 June, 2025 | 5:08 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కల్పతరువు ఇప్ప చెట్టు!

02-06-2025 12:20:10 AM

  1. ఒక్క చెట్టుతో 1౦౦ ప్రయోజనాలు
  2. గిరిజనులకు బతుకుదెరువు

చర్ల. జూన్ 1 (విజయ క్రాంతి): ఇప్ప చె ట్టు బహు ప్రయోజనా కారి. గిరిజనుల జీవనోపాధికి ఎంతో దోహద పడుతోంది. ఒక సందర్భంలో గిరిజనులకు ఆరాధ్య దైవం అ ని కూడా వ్యవహరిస్తుంటారు.ఇప్పచెట్టు ప లు విధాలుగా గిరిజనులకు ఉపయోగపడుతుంది. ఎండాకాలం వచ్చిందంటే ఇప్పపూలు సేకరణ, తర్వాత ఇప్ప కాయల సీజన్ వస్తుంది. ఇప్ప కాయలు గిరిజనులకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి.

గిరిజనులు ఇప్ప కాయలను పలు రకాల వంటలకు ఉపయోగించే నూనె పదార్థం తయారు చేస్తారు, అటవీ ప్రాంతాల్లో జీవించే ఆదివాసి గిరిజనులు, ఇప్ప కాయలు ఇప్ప చెట్టు నుండి వచ్చే పండ్లు సేకరిస్తారు ఇవి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి.  ఇప్పకాయలు, ఇప్ప పూలు, ఇప్ప నూనె అన్నీ ఒకే చెట్టు నుండి లభించడంతో ఇప్పచెట్టు గిరిజన ఆదివాసీలకు ఆరాధ్య దేవమని చెప్పక తప్పదు. 

ఇప్పచెట్టు వల్ల లాభాలు

విప్ప చెట్టు కేవలం అటవీ ప్రాంతంలో మాత్రమే కనిపిస్తుంది, సైన్స్ పరిభాషలో దీ న్ని సపోటేసి కుటుంబానికి చెందినది గా వర్ణిస్తారు, గిరిజనులు అత్యధికంగా ఈ చెట్టుపై ఆధారపడి జీవనం కొనసాగిస్తుంటారు, ఆదివాసి గిరిజనులు ఈ ఇప్ప చెట్టును నరకదానికి అసలు ఒప్పుకోరు. ఎందుకంటే ఇది మూడు కాలాలపాటు గిరిజనులకు అ టవీ ప్రాంతంలో జీవించే ఆదివాసీలకు ఎం తగానో ఉపయోగకరంగా ఉంటుంది. ఈ ఇప్ప చెట్టు వేసవి ఆరంభంలో ఇప్ప పూల ను ఇస్తుంది, సీజన్ పూర్తయిన తర్వాత, ఇప్ప కాయలు మొదలవుతాయి

ఇప్ప కాయలతో లాభాలు

 ఇప్ప కాయలు ఇప్పపూల దశ అయిపోగానే కాయలు కాస్తుంది, చెట్టు నుండి ఈ కా యలు పండి నేలపై రాలినప్పుడు గిరిజను లు వాటిని సేకరించి ఎడ్డబెట్టి వాటి గింజలను తీసి పప్పులుగా తయారుచేసి గానుగ ద్వారా నూనెను పట్టించి వారి దైనందిక జీవనంలో ఇప్ప నూనె ఎంతగానో ఉపయోగి స్తూ ఉంటారు. గిరిజనుల పూర్వీకులు ఇప్ప నూనెలను తలకు కూడా రాసుకునే వారిని చెబుతుంటారు.

ఇప్ప కాయల వలన ఉపయోగాలు

ఆదివాసీలకు ఇప్పటికీ నేటి తరానికి కూ డా ఇప్ప కాయలు ఆరోగ్య ప్రదాతలుగా పనిచేస్తున్నాయి. ఇవి రక్తపోటును నియంత్రిస్తా యని ఇప్ప కాయలు జీర్ణక్రియను మెరుగుపరుస్తాయని. ఇప్ప కాయలు కీళ్ల నొప్పులు, కీళ్ల వాతలను తగ్గిస్తాయని ఇక్కడ గిరిజనుల నమ్మకం.

అంతేకాక సైంటిఫిక్ గా కూడా ఇప్ప కాయలు చర్మ సంబంధిత సమస్యలకు ఉపయోగపడతాయని ఇప్ప కాయలు రోగనిరోధక శక్తిని పెంచుతాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇప్ప కాయల గింజల నుండి నూనె వస్తుంది. ఈ నూనెను వనస్పతి, సబ్బు, కొవ్వత్తుల తయారీలో ఉపయోగిస్తారు. దీపారాధనకు, ఫర్నెస్ ఆయిల్ గా కూడా ఇప్ప నూనెను ఉపయోగిస్తారు.

ఇప్ప పూలతో లాభాలు

 వేసవి ఆరంభ దశలోనే ఇప్పపూల సీజ న్ ప్రారంభమవుతుంది గిరిజనులు వీటిని ఉదయాన్నే సేకరించి వీటిని ఎండపెట్టి వీటి ద్వారా సారాయిని కాస్తారు. ఈ సారాయి వారి ఆచార సాంప్రదాయాలలో పెళ్లిళ్ల సమయంలో తీసుకుంటూ ఉంటారు, ఇప్ప పూ లు కూడా ఆరోగ్యానికి ఎంతగానో ఉపయోగపడుతున్నాయి.

ఇప్పపూలు ఆరోగ్యానికి చా లా మేలు చేస్తాయి. ఇప్ప పూలు కడుపులో పుళ్లు, నొప్పి సమస్యలకు చెక్ పెడతాయి. దంత సమస్యలతో బాధపడేవారికి కూడా ఇ ప్ప పూలు ఎంతగానో ఉపయోగపడతాయి. శ్రీ సీతారామచంద్ర స్వామి వారికి ఎండిన ఇప్ప పువ్వులు కొందరు భక్తులు నైవేద్యంగా కూడా పెడుతుంటారు. దీంతో ఇప్ప పువ్వులకు బాగా డిమాండ్ కూడా పెరిగింది.

ఇప్ప చెట్టు ఆకులు ఉపయోగమే

ఈ చెట్టు అన్ని విధాలుగా ఉపయోగపడుతుంది ఇప్ప చెట్టు ఆకులు పశువులకు మేతగా ఉపయోగపడుతున్నాయి, గిరిజను లకు ఆరాధ్య దైవం గా ఉన్న ఈ ఇప్పచెట్టు అన్ని విధాలుగా గిరిజనులకు ఎంతగానో ఉపయోగపడుతుందని ఈ చెట్టు అటవీ ప్రాంతంలో తప్ప మరేఎక్కడ దొరకని ఇప్పచెట్టును ఆదివాసి గిరిజనులు అన్ని విధాలు గా దీని ఉపయోగించుకుంటారు అనడంలో అతిశయోక్తి లేదు.