calender_icon.png 22 August, 2025 | 10:25 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆడపడుచులకు అండగా కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్

22-08-2025 12:47:42 AM

ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి 

పటాన్ చెరు, ఆగస్టు 21 : పేదింటి ఆడపడుచుల వివాహాలకు కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ పథకాలు అండగా నిలుస్తున్నాయని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. గురువారం పటాన్ చెరు డివిజన్ పరిధిలోని క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో నియోజకవర్గ పరిధిలోని గుమ్మడిదల, జిన్నారం, అమీన్ పూర్, పటాన్ చెరు, రామచంద్రాపురం రెవిన్యూ మండలాల పరిధిలోని వివిధ గ్రామాలకు చెందిన 180 మంది లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల ద్వారా మంజూరైన రూ.1.80 కోట్ల విలువైన చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ  పటాన్ చెరు  నియోజకవర్గంలో అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందిస్తూ వారి ఆర్థిక అభ్యున్నతికి తోడ్పాటు అందిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పటాన్ చెరు కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, రామచంద్రాపురం కార్పొరేటర్ పుష్ప నగేష్,

జిల్లా పరిషత్ మాజీ వైస్ చైర్మన్ ప్రభాకర్, అమీన్ పూర్ మాజీ జెడ్పిటిసి సుధాకర్ రెడ్డి, గుమ్మడిదల మాజీ జెడ్పిటిసి కుమార్ గౌడ్, అమీన్ పూర్ మాజీ ఎంపీపీ దేవానందం, తెల్లాపూర్ మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ రాములు గౌడ్, విజయ్ భాస్కర్ రెడ్డి, షేక్ హుస్సేన్, సీనియర్ నాయకులు వెంకట్ రెడ్డి, దశరథ్ రెడ్డి, ఆయా మండలాల తహసిల్దారులు, మాజీ ప్రజా ప్రతినిధులు, తదితరులుపాల్గొన్నారు.