22-08-2025 12:48:53 AM
ఎమ్మెల్యే చింత ప్రభాకర్
సంగారెడ్డి, ఆగస్టు 21: సంగారెడ్డి నియోజకవర్గంలో పెండింగ్ లో ఉన్న రహదారుల వివరాలను ఎమ్మెల్యే చింత ప్రభాకర్ గురువారం పంచాయతీ రాజ్ శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు.
నియోజకవర్గంలోని ప్రధానంగా పూర్తిగా దెబ్బ తిన్న రోడ్ల మరమ్మతులు చేయాలని అధికారులను కోరారు. నూతన రహదారులు మంజూరు చేయాలని పంచాయతీ రాజ్ శాఖ అధికారుల దృష్టికి, పంచాయతీ రాజ్ మినిస్టర్ దృష్టికి లేఖ ద్వారా తెలియపరుస్తానని ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ తెలిపారు.
అనంతరం శుక్రవారం ప్రారంభం కానున్న పనుల జాతర కార్యక్రమానికి ఎమ్మెల్యే ను పంచాయతీ రాజ్, ఇంజనీరింగ్ శాఖ అధికారులు ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్ శాఖ ఈఈ యుగేందర్, డీఈలు దీపక్, సుభాష్‌పాల్గొన్నారు.