9 June, 2026 | 3:45 PM

Breaking News

ఆర్అండ్‌బీ ఈఎన్సీ మోహన్ నాయక్ ఇంట్లో ఏసీబీ తనిఖీలు   •   రానున్న రెండు రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు   •   స్టేషన్ ఘన్‌పూర్‌లో పర్యటించిన డిప్యూటీ సీఎం భట్టి   •   ఎప్టీసీసీఐ అవార్డుల ప్రదానోత్సవం... పరిశ్రమల ద్వారా పెద్దఎత్తున ఉపాధి   •   విశాఖ స్టీల్ ప్లాంట్ బాధితులను పరామర్శించిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్   •   గచ్చిబౌలిలో భారీ చోరీ.. ఇద్దరు నిందితులు అరెస్ట్   •   ఖమ్మంలో బాలికపై లైంగిక దాడి   •   తాటి చెట్టు పైన గుండెపోటుతో వెంకన్న మృతి   •   నూతన వైద్యాధికారిగా డాక్టర్ కె. కృష్ణ   •   అనురాగ్‌లో ఫార్మాస్యూటికల్ టీచర్స్ ఆఫ్ ఇండియా ప్రోగ్రామ్   •  

కళ్యాణ లక్ష్మి చెక్కులను వెంటనే అందించాలి

06-11-2024 03:11 PM

బెల్లంపల్లి (విజయక్రాంతి): పేదలకు మంజూరైన కళ్యాణ లక్ష్మి చెక్కులను వెంటనే అందించాలని ఎంసిపిఐయు జిల్లా అధ్యక్షులు సబ్బని రాజేంద్రప్రసాద్, జిల్లా సహాయ కార్యదర్శి పసులేటి వెంకటేష్ లు డిమాండ్ చేశారు. పార్టీ కార్యాలయంలో వారు మాట్లాడుతూ 15 రోజుల కిందట కల్యాణ లక్ష్మి చెక్కులు తహసిల్దార్ కార్యాలయానికి వచ్చినప్పటికీ వాటిని లబ్ధిదారులకు పంపిణీ చేయకుండా తహసీల్దార్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ఆరోపించారు. చెక్కులను తహసీల్దార్ తన కార్యాలయంలో పెట్టుకొని ఎమ్మెల్యే చేతుల మీదుగా అందిస్తామని చెప్పడం సబబు కాదని వారు పేర్కొన్నారు. వెంటనే కళ్యాణ్ లక్ష్మి చెక్కులను అందించాలని వారు డిమాండ్  చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఆరేపల్లి రమేష్, దుర్గం లక్ష్మి, కంపల్లి రాధ, కామెర పద్మ, ఆరేపల్లి సతీష్, రాజు, నిఖిల్, హర్షవర్ధన్ లు పాల్గొన్నారు.