calender_icon.png 9 May, 2025 | 5:34 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గ్లోబల్ ప్రమోషన్స్‌లో కన్నప్ప

08-05-2025 12:59:32 AM

విష్ణు మంచు తన డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ను ఓ మైలురాయి చిత్రంగా మలిచేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఆయన టైటిల్ రోల్ పోషించిన ఈ సినిమాలో భారీ తారాగణం భాగమైంది. ఈ క్రమంలోనే ప్రపంచవ్యాప్తంగా ఉన్న మార్కెట్‌ను స్టడీ చేస్తూ గ్లోబల్‌గా ప్రమోట్ చేసేందుకు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా ఆయన ఈ మూవీ ప్రమోషన్స్‌ను అమెరికా నుంచి ప్రారంభించనున్నారు.

ఈ మేరకు ‘కన్నప్ప’ టూర్ మే 8న న్యూజెర్సీలో ప్రారంభం కానుంది. అక్కడ విష్ణు నార్త్ బ్రున్స్‌విక్‌లోని రీగల్ కామర్స్ సెంటర్‌లో అభిమానులతో ముచ్చటించనున్నారు. తర్వాత మే 9న డల్లాస్, టెక్సాస్‌లలో ప్రేక్షకులతో సందడి చేయనున్నారు.

చివరగా విష్ణు చేపట్టిన ఈ పర్యటన మే 10న శాన్‌ఫ్రాన్సిస్కో బే ఏరియాలో ముగుస్తుంది. అనంతరం ఇండియాలోనూ పలు ప్రధాన నగరాల్లో ప్రచార కార్యక్రమాలు నిర్వహించనున్నారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ తదితర భాషల్లో జూన్ 27న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ మూవీ ఓవర్సీస్ రిలీజ్ బాధ్యతను వాసారా చూసుకుంటోంది.