08-05-2025 12:57:56 AM
రవిప్రకాశ్‌రెడ్డి, సమీర్‌దత్త, టేస్టీ తేజ, పల్లవి, రమ్యారెడ్డి తదితరులు ప్రధాన పాత్రల్లో రూపొందిన తాజాచిత్రం ‘6జర్నీ. బసీర్ ఆలూరి దర్శకత్వంలో అరుణకుమారి ఫిలింస్ బ్యానర్‌పై పాల్యం రవిప్రకాశ్‌రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ చిత్రం మే 9న విడుదల కానున్న సందర్భంగా దర్శకుడు బసీర్ మీడియాతో ముచ్చటించారు. “సినిమా ఇండస్ట్రీలో ఎన్నో కష్టాలు పడ్డాను. ఇదివరకు తెలుగులో సమరం, కన్నడలో మరో చిత్రాన్ని చేశాను.
ఇప్పుడు నా మూడో సినిమాతో ప్రేక్షకుల ముందుకొస్తున్నా. ఇది ఆరుగురి జీవిత ప్రయాణం. గోవా ట్రిప్‌ను ఎంజాయ్ చేసి సూసైడ్ చేసుకోవాలనుకునే ఓ బ్యాచ్ కథే ‘6జర్నీ’. అలాంటి వారి ప్రయాణంలో ఎదురైన పరిస్థితులు ఏంటి? అన్నది ఈ సినిమా కథ. నిర్మాత రవిప్రకాశ్‌రెడ్డిది మా ఊరే. ఈ కథ ఆయనకు నచ్చడంతో ప్రాజెక్ట్ ముందుకెళ్లింది. క్ల్లుమాక్స్ చాలా గొప్పగా ఉంటుంది.
శ్రీరాముడు పుట్టిన నేల మీద ఉగ్రవాదులు దాడి చేయడం ఏంటి? ఇక్కడ యువత ఎలా పోరాడాలి? అంటూ దేశభక్తిని రేకెత్తించేలా అద్భుతంగా తెరకెక్కించాం. ప్రస్తుత పరిస్థితులకు తగ్గట్టుగా క్లుమైక్స్ ఉంటుంది. సినిమా పూర్తిగా టెర్రరిజం మీదే నడుస్తుంది. మళ్లీ అక్టోబర్‌లో ఓ సినిమా చేయబోతోన్నా. ఆ చిత్రం ముంబయి బ్యాక్‌డ్రాప్‌లో ఉంటుంది. ఇంకా చర్చలు జరుగుతున్నాయి” అని తెలిపారు.