18 April, 2026 | 7:05 AM

సకాలంలో వర్షాలు కురవాలని కప్పతల్లి పూజ

20-06-2025 01:22 PM

హుజురాబాద్:(విజయక్రాంతి): జూన్ నెల సగం ముగయడంతో ఇప్పటివరకు వర్షాలు కురవకపోవడంతో పూర్వికులు కప్పతల్లి ఆట ఆడితే వరుణదేవుడు కరుణించి వర్షాలు కురుస్తాయనే ఆచారం ఉండేది. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్(Huzurabad Mandal) మండలంలోని పెద్ద పాపయ్య పల్లి  గ్రామంలో శుక్రవారం రైతులు వర్షాలు కురవాలని సాంప్రదాయ పద్ధతిలో గ్రామస్తులుకప్పతల్లి పూజ నిర్వహించారు. వానలు సకాలంలో కురిసి పంటలకు ఉపయుక్తంగా ఉండాలని ఆశిస్తూ గ్రామంలోని రైతులు, మహిళలు కలిసి కప్పలను అలంకరించి గ్రామంలో ఊరేగింపు నిర్వహించారు.పాటలు పాడుతూ,భక్తిశ్రద్ధలతో కప్పతల్లి పూజలు నిర్వహించారు. వర్షాలు కురిసి పంటలు బాగా పండాలని, అన్నదాతలు సంతోషంగా ఉండాలని ప్రజలు ఆకాంక్షించారు.గ్రామ పెద్దలు మాట్లాడుతూ, ఈ పూజలు పాతకాలం నుంచి సంప్రదాయంగా నిర్వహించబడుతున్నట్లు తెలిపారు. వర్షాలు కురిసే వరకు పూజలు కొనసాగుతాయని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో రావుల వేణుగోపాల్ రెడ్డి, భూపాల్ రెడ్డి, భరత్ రెడ్డి తో పాటు తదితరులు పాల్గొన్నారు.