17-11-2025 12:50:11 AM
ఎర్రుపాలెం నవంబర్ 16 (విజయ క్రాంతి): భవిష్యత్ రాష్ట్ర రాజకీయాలకు కాపు కులస్తులందరూ ఐక్యంగా అభివృద్ధి చెందుతూ రాజకీయాలను శాసించే విధంగా ఎదగాలని వద్దిరాజు రవిచంద్ర పేర్కొన్నారు. మండల కాపు కులస్తుల వన సమారాధన ఆదివారం నాడు జమలాపురం గ్రామంలో నీ మామిడి తోట నందు నిర్వహించారు.
ఈ వనసమారాధన కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొని ఆత్మీయ సమావేశంలో మా ట్లాడుతూ ఎర్రుపాలెం మండలంలోని కాపులందరూ ఐక్యంగా ఉంటూ ఇతర కులాలను గౌరవించుకుంటూ కాపు కులస్తులందరూ ఐక్యంగా అభివృద్ధి చెందుతూ, కాపు కుటుంబాలు పిల్లలను చదివించుకుంటూ పిల్లలను అన్ని రంగాలలో అభివృద్ధి చెందించాలని పేర్కొన్నారు.
కాపులందరూ వన సమారాధన వంటి కార్యక్రమాలలో పాల్గొని పరిచ యాలను పెంచుకొని ఒకరికి ఒకరు సహాయ సహకారాలు అందించుకుంటూ అభివృద్ధి చెందుతూ ఉండాలని పేర్కొన్నారు. కాపుల సమావేశాలు జరిగేటప్పుడు కాపులందరూ పాల్గొనాలని వివరించారు. ఎర్రుపాలెం మండలం తనకు సుపరిచిత మండలం అని పేర్కొన్నారు. ఎర్రుపాలెం మండలంలో కా పుల కళ్యాణ మండపానికి తన వంతు సహాయంగా తనకు వచ్చే అభివృద్ధి నిధుల నుం డి కళ్యాణ మండపం నిర్మాణానికి నిధులు వెచ్చిస్తానని పేర్కొన్నారు.
భవిష్యత్తులో కాపు కులస్తులందరూ ఐక్యంగా ఉండి ఇతర కులా ల కన్నా ముందు ఉండే విధంగా రాష్ట్ర రాజకీయాలకు కేంద్ర బిందువు లాగా మారాలని పేర్కొన్నారు. కాపు కులస్తులకు తాను ఎల్లవేళలా తన వంతు సహాయ సహకారాలు అం దిస్తానని పేర్కొన్నారు. ఈ సమావేశంలో పాల్గొన్న మధిర వ్యవసాయ మార్కెట్ కమి టీ చైర్మన్ బండార నరసింహారావు మాట్లాడుతూ కాపులందరూ ఐక్యంగా అభివృద్ధి చెందుతూ కాపుల వారి పిల్లలను చదివించుకుంటూ అభివృద్ధి చెందాలని పేర్కొన్నారు. మండలంలో కాపులందరికీ తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని వివరించారు.
కాపుల రాష్ట్ర అధ్యక్షుడు ఆకుల గాంధీ మాట్లాడుతూ రాష్ట్రంలోని కాపులందరూ ఐక్యతతో కలిసిమెలిసి ఉండాలని, ఐక్యంగా అభివృద్ధి చెందాలని వివరించారు. కాపుల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించి కాపులకు సహాయ సహకారాలు అందిస్తామని పేర్కొన్నారు. అంతకుముందు మామి డి తోటలో వన సమారాధన పూజలు నిర్వహించి, పెద్ద ఎత్తున వన సమారాధనలో పాల్గొన్న కాపులకు వన భోజనాలను నిర్వహించారు.
మహిళలకు సాంస్కృతిక కా ర్యక్రమాలను నిర్వహించారు. ఈ సమావేశంలో మండల కాపు నాయకులు సూరం శెట్టి భాస్కరరావు, శ్రీ పాల శెట్టి తిరుపతిరావు, తోట సాంబశివరావు, కామిశెట్టి శ్రీనివాసరావు, గంధం శ్రీనివాసరావు, పసుపులేటి మహేష్, మిరియాల శ్యాంప్రసాద్, మల్లెల లక్ష్మణరావు చిన్నం రాము, చిన్నం శీను, వివిధ గ్రామాల నుండి వచ్చిన కాపు కులస్తులు పాల్గొన్నారు.